Tamilnadu rains: తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. భారీ వర్షాలకు చెన్నై నగరం నిండుకుండలా మారింది. చెన్నై, కడలూరు, కాంచీపురం, మధురై, కన్యాకుమారి సహా పలు జిల్లాల్లో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో చెన్నై సహా 28 జిల్లాలో పాఠశాలలు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించించింది. సబ్‌వేలను మూసివేసింది. బంగాళాఖాతంలో శ్రీలంక తీరంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో చెన్నైలోని పలు ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజా అంచనా ప్రకారం నీలగిరి, కోయంబత్తూరు, తిరుప్పూర్, కడలూరు, ఈరోడ్, విల్లుపురం, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు, చెన్నై, మదురై, కన్యాకుమారి తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తమిళనాడులోని తిరువళ్లూరు, రాణిపేట్, కాంచీపురం జిల్లాలకు భారత వాతావరణ శాఖ శుక్రవారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రోజుల్లో చెన్నై, అనేక ఇతర జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ప్రకారం.. నైరుతి బంగాళాఖాతం, ఈశాన్య శ్రీలంకలోని పరిసర ప్రాంతాలపై బాగా గుర్తించబడిన అల్పపీడనం శనివారం ఉదయం వరకు వాయువ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు వెళ్లే అవకాశం ఉంది. ఇది శని, ఆదివారాల్లో తమిళనాడు, కేరళ మీదుగా వెళ్లే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు.
Transplant Nose: గ్రేట్.. చేతిపై ముక్కును పెంచి ముఖానికి అతికించారు!
చెన్నైలో మొత్తం 169 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామని, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన నీటిని బయటకు పంపేందుకు 879 మోటార్ పంపులను సిద్ధంగా ఉంచామని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.జనసాంద్రత ఎక్కువగా ఉండే చెన్నై జోన్‌లోనే మొత్తం 17 మంది మానిటరింగ్ అధికారులను నియమించగా, మిగిలిన జిల్లాలకు 43 మంది అధికారులు విధుల్లో ఉంటారు. చెంగల్‌పేట, కాంచీపురం, తిరువళ్లూరు మండలాలకు ఇద్దరు చొప్పున మానిటరింగ్ అధికారులను నియమించారు.
రాష్ట్రం 5,093 సహాయ శిబిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌కు చెందిన 1,149 మంది సిబ్బందిని, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) నుండి 899 మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచింది.చెంబరంబాక్కం జలాశయం మొత్తం సామర్థ్యం 24 అడుగులు కాగా గురువారం ఉదయం 8 గంటల సమయానికి 20 అడుగులకు చేరుకుందని అధికారులు తెలిపారు. అదేవిధంగా పుఝల్ జలాశయం పూర్తి సామర్థ్యం 21.20 అడుగులకు గాను 18.53 అడుగులకు చేరుకుంది.