మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో వర్షం బీభత్సం సృష్టించింది. జూన్ 1 నుంచి ప్రారంభమైన వర్షాల ప్రభావంతో.. ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు. ఇందులో పిడుగుపాటు కారణంగా 11 మంది మృతి చెందారు. డివిజనల్ కమిషనర్ కార్యాలయం రూపొందించిన ప్రాథమిక సర్వే నివేదిక ప్రకారం.. గత రెండు రోజుల్లో పర్భానీ, హింగోలి జిల్లాల్లో నాలుగు మరణాలు నమోదయ్యాయి. జూన్ 1 నుంచి మరఠ్వాడాలోని ఏడు జిల్లాల్లో వర్షాల కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో నాలుగు మరణాలు గత రెండు రోజుల్లోనే సంభవించాయి. నలుగురు బాధితుల్లో ఇద్దరు 14 ఏళ్ల బాలుడు, 40 ఏళ్ల మహిళ ఉన్నారు.
Red Fort Terror Attack: పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ క్షమాభిక్ష తిరస్కరణ..
వరద నీటిలో కొట్టుకుపోయి ఇద్దరు మృతి చెందగా, ఆవుల కొట్టం కూలి ఒకరు మృతి చెందారు. మరాఠ్వాడాలోని మొత్తం ఎనిమిది జిల్లాల్లో ఏడింటిలో ఈ మరణాలు సంభవించాయి. సర్వే నివేదిక ప్రకారం, లాతూర్ జిల్లాలో అత్యధికంగా నాలుగు మరణాలు సంభవించగా, పర్భానీ మరియు నాందేడ్ ఒక్కొక్కటి మూడు మరణాలు నమోదయ్యాయి. మరో నాలుగు జిల్లాలు.. జల్నా, హింగోలి, బీడ్ మరియు ధరాశివ్ ఒక్కొక్కరు మరణించారు. జూన్ 1 నుంచి మరాఠ్వాడాలోని మొత్తం ఎనిమిది జిల్లాల్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా మనుషులే కాకుండా 251 జంతువులు కూడా ప్రాణాలు కోల్పోయాయి. గత రెండు రోజుల్లో 99 జంతువులు చనిపోయాయి.
US: తల్లి, సోదరుడ్ని కాల్చి ఎన్నారై ఆత్మహత్య
భారీ వర్షాల కారణంగా జూన్ 12న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్‌లను వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు.. బీడ్ జిల్లాలో గత రెండు రోజుల నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దీంతో.. మజల్‌గావ్ తాలూకాలోని కోతల గ్రామంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి నదికి వరద పోటెత్తింది. లాతూర్ జిల్లాలోని నెల్వాడ్ గ్రామంలో వ్యవసాయం భూమి, రోడ్లు జలమయమయ్యాయి. గ్రామం నుంచి బయటకు వెళ్లే రహదారిపై నుంచి నీరు ప్రవహించడంతో గ్రామస్తులు బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ భూమిలోకి నీరు చేరడంతో మట్టి కొట్టుకుపోయింది. వాగులు పొంగి పొర్లడంతో రహదారులు మూసుకుపోయాయి.