Site icon NTV Telugu

GHMC: భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అలర్ట్.. ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

Ghmc

Ghmc

GHMC Alert: గ్రేటర్ హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌కు అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించడంతో జీహెచ్‌ఎంసీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. శిధిలావస్థలో ఉన్న భవనాలలో ఉన్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు మహానగర పాలక సంస్థ ఆదేశాలు జారీ చేసింది. ఈ రాత్రి మరింత వర్షం పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నాలా పనులు పూర్తి కాని ఏరియాలపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. నీరు నిలిచే ప్రాంతాల్లో సిబ్బంది 24 గంటలూ ఉంటూ… నీటిని తరలించేలా చర్యలు చేపడుతున్నారు.

Also Read: Harish Rao : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. వైద్య శాఖను అప్రమత్తం చేసిన మంత్రి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్‌టీంలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. శిధిలావస్థలో ఉన్న భవనాలలో ఉన్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న చోట ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరం అయితేనే బయటకు వెళ్లాలని నగర వాసులకు విజ్ఞప్తి చేశారు. వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ టోల్ ఫ్రీ నెంబర్ 9000113667ను ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 426 మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాల ఏర్పాటు చేసినట్లు మేయర్ తెలిపారు. అధికారులతో మాట్లాడుతూ ఎప్పటి కప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు మేయర్ తెలిపారు.

Also Read: Telangana Rains: భారీ వర్షాలపై అప్రమత్తం, ప్రాణనష్టం జరగకుండా చూడాలి.. అధికారులకు సీఎస్ ఆదేశాలు

157 స్టాటిక్ టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. 339 వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. నగరంలోని 185 చెరువులు, కుంటలలో నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. చెరువుల్లో నీటిని అవసరమైతే ముందస్తుగా వదులుతున్నామన్నారు. శిధిలావస్థలో ఉన్న, పురాతన భవనాలపై ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టామన్నారు. నగరంలోని అన్ని కీలక ప్రాంతాల్లో ఈవీడీఎం బృందాలను మోహరించామని మేయర్ చెప్పారు.

Exit mobile version