NTV Telugu Site icon

Andhra Pradesh: రాష్ట్రంలో భారీ వర్షాలు.. వరదల్లో గ్రామాలు

Ap Rains

Ap Rains

ఏపీలో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగుల్చాయి. మరోవైపు.. లంక గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అల్లూరు జిల్లాలో వర్షాల జోరు తగ్గలేదు. దీంతో.. వాగులు, వంకలు ఉధృతంగా ఉప్పోంగుతున్నాయి. ముంచంగిపుట్టు మండల పరిధిలో భారీ వర్షాలకు లక్ష్మీపురం పంచాయితీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు వారాలు క్రితం నుండి గెడ్డలు ఉధృతి వల్ల జనజీవనం స్తంభించి పోయింది.. వారపు సంతకు వెళ్లి నిత్యావసర సరుకులు తీసుకొని రావడానికి 30 గ్రామాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. బైకులను డోలిమోత తీసుకొని వెళ్తున్నారు గిరిజనులు. వాగులు ఉధృతి చూసి కొంతమంది గిరిజనులు వెనుతిరుతుండగా.. మరికొందరు ప్రాణాలకు తెగించి దాటుతున్నారు.

Read Also: Paris Olympics 2024: రెండో రోజు భారత్ శుభారంభం..ఫైనల్ కి చేరిన టీంలు..

అటు కోనసీమ జిల్లా లంక గ్రామాలలో నిత్యావసర సరుకులకు జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇల్లు దాటి బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. చుట్టూ వరద నీరు చేరడంతో అయోమయం చెందుతున్నారు. చంటి పిల్లలకు కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Tamil Nadu: తమిళనాడులో మరో రాజకీయ హత్య.. ఏఐడీఎంకే నేత మర్డర్..

వర్షాలు కారణంగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 45 డివిజన్ లో ఇందిరా నగర్ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. వర్షంతో డ్రైనేజీలు పొంగిపోర్లి. మురికి నీరు ఇళ్లల్లోకి ప్రవేశించాయి. దుర్వాసన వెదజల్లడంతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. మురికి నీళ్లు విషసర్పాలు తాండవించడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రాత్రి వేళలో బయటికి రావాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఉంది. కనీసం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ.. ప్రజా ప్రతినిధులు గానీ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆక్రందన పెడుతున్నారు.