NTV Telugu Site icon

Rains Effect: ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో రేపు విద్యా సంస్థలకు సెలవు

Schools Holiday

Schools Holiday

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో.. రేపు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. ఇప్పటికే జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో.. జిల్లాలోని కళాశాలలకు, అన్ని విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు.

Read Also: Popular TV Actor Passed Away: టీవీ పరిశ్రమలో విషాదం..గుండెపోటుతో 48 ఏళ్ల ప్రముఖ టీవీ నటుడు కన్నుమూత

మరోవైపు.. విజయనగరం జిల్లాలో కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.భారీ వర్షాల నేపధ్యంలో సోమవారం జిల్లాలోని స్కూళ్ళు, కళాశాలలు, విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. అంతేకాకుండా.. వర్షాలు సోమవారం కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజా వినతులు స్వీకరణ కార్యక్రమం రద్దు చేస్తున్నట్టు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ తెలిపారు.

Read Also: Rajnath Singh: పీఓకే ప్రజలు భారత్‌లో చేరాలి.. పాకిస్తాన్‌లా కాకుండా సొంత వారిలా చూస్తాం..

వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. కళింగపట్నంకి తూర్పున 280 కి.మీ., గోపాల్‌పూర్‌కి తూర్పు-ఆగ్నేయంగా 230 కి.మీ., పారాదీప్ కి దక్షిణ-ఆగ్నేయంగా 260 కి.మీ, దిఘాకి దక్షిణంగా 390 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రేపు సాయంత్రం లేదా రాత్రి పూరీ- దిఘాల మధ్య వాయుగుండం తీరాన్ని దాటే అవకాశం ఉంది. రానున్న రెండు రోజులలో కోస్తా జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.