Heavy Rains in AP: ఏపీలో కుంభవృష్టి.. పోలవరంలో 27 సెంటీ మీటర్ల వర్షపాతం
- ఏపీలో పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు..
- వాయుగుండం ప్రభావంతో మరో మూడు రోజులు భారీ వర్షాలు..
- మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరికలు..
- అత్యధికంగా పోలవరంలో 27 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains in AP: బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.. వాయుగుండం ప్రభావంతో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.. ఇక, బలమైన ఈదురు గాలులుతో సముద్రం అలజడిగా మారింది.. దీంతో.. కళింగపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు..
Read Also: Ponguleti Srinivas Reddy: బీసీ జనగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు..
Also Read
- Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
వాయువ్య బంగాళాఖాతం వైపు భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది అమరావతి వాతావరణ కేంద్రం.. గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.. గాలుల తీవ్రత పెరిగి 65 కిలోమీటర్ల వేగం వరకూ చేరే అవకాశం ఉందని సూచించింది.. ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వద్ద ఇవాళ, రేపు అల్పపీడనం కేంద్రీకృతమై ఉంటుందని వెల్లడించింది.. ఇవాళ, రేపు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. వాయువ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో సముద్రం తీవ్రమైన అలజడితో ఉంటుంది.. మత్స్యకారులు సముద్రం వైపు వెళ్లరాదని హెచ్చరించింది.. స్ధానిక అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది అమరావతి వాతావరణ కేంద్రం.
ఇక, ఏపీలో అత్యధిక వర్ష పాతం నమోదైన సెంటర్లను పరిశీలిస్తే..
* కుకునూరు, పోలవరంలో 27 సెంటీ మీటర్లు..
* చింతలపూడిలో 18 సెంటీ మీటర్లు..
* పూసపాటిరేగలో 16 సెంటీ మీటర్లు..
* తాడేపల్లి గూడెంలో 13 సెంటీ మీటర్లు..
* కొయ్యలగూడెంలో 12 సెంటీ మీటర్లు..
* తణుకులో 11 సెంటీ మీటర్లు..
* రణస్థలం, విశాఖపట్నంలో 10 సెంటీ మీటర్లు..
* భీమిలిలో 9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
తాజావార్తలు
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!