NTV Telugu Site icon

Heavy Rains in AP: ఏపీలో కుంభవృష్టి.. పోలవరంలో 27 సెంటీ మీటర్ల వర్షపాతం

Rains

Rains

Heavy Rains in AP: బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.. వాయుగుండం ప్రభావంతో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.. ఇక, బలమైన ఈదురు గాలులుతో సముద్రం అలజడిగా మారింది.. దీంతో.. కళింగపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు..

Read Also: Ponguleti Srinivas Reddy: బీసీ జనగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు..

వాయువ్య బంగాళాఖాతం వైపు భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది అమరావతి వాతావరణ కేంద్రం.. గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.. గాలుల తీవ్రత పెరిగి 65 కిలోమీటర్ల వేగం వరకూ చేరే అవకాశం ఉందని సూచించింది.. ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వద్ద ఇవాళ, రేపు అల్పపీడనం కేంద్రీకృతమై ఉంటుందని వెల్లడించింది.. ఇవాళ, రేపు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. వాయువ్య, పశ్చిమ‌మధ్య బంగాళాఖాతంలో సముద్రం తీవ్రమైన అలజడితో ఉంటుంది.. మత్స్యకారులు సముద్రం వైపు వెళ్లరాదని హెచ్చరించింది.. స్ధానిక అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది అమరావతి వాతావరణ కేంద్రం.

ఇక, ఏపీలో అత్యధిక వర్ష పాతం నమోదైన సెంటర్లను పరిశీలిస్తే..
* కుకునూరు, పోలవరంలో 27 సెంటీ మీటర్లు..
* చింతలపూడిలో 18 సెంటీ మీటర్లు..
* పూసపాటిరేగలో 16 సెంటీ మీటర్లు..
* తాడేపల్లి గూడెంలో 13 సెంటీ మీటర్లు..
* కొయ్యలగూడెంలో 12 సెంటీ మీటర్లు..
* తణుకులో 11 సెంటీ మీటర్లు..
* రణస్థలం, విశాఖపట్నంలో 10 సెంటీ మీటర్లు..
* భీమిలిలో 9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

Show comments