Afghanistan: ఆప్ఘనిస్థాన్ ను ముంచెత్తిన వర్షాలు..50 మంది మృత్యువాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆప్ఘనిస్థాన్‌లో తీవ్ర విషాదం నెలకొంది. భారీ వర్షాలు ఆ దేశాన్ని ముంచెత్తుతున్నాయి. చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. గత నెలలో కురిసిన వర్షాల వల్ల 70 మంది మృతి చెందగా.. ఆ విషాదం మరువక ముందే మరో సారి భారీ వర్షాలు కురిశాయి. తాజాగా ఉత్తర ప్రావిన్స్ బగ్లాన్‌లో భారీ వర్షాల కారణంగా 50 మంది మరణించారు. సుమారు 100 మందికి పైగా గాయపడ్డారు. ఆస్తి నష్టం భారీగా సంభవించింది. అకస్మాత్తుగా వచ్చిన వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ మతీన్ ఖనీ వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వరదలతో ఐదు జిల్లాలు ప్రభావితమయ్యాయని.. 150 మందికి పైగా ప్రజలు చిక్కుకుపోయారని వారిని రక్షించేదుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
Also Read
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
- Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
- Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
ఉన్నట్టుండి భారీ వర్షాలు రావడంతో వివిధ జిల్లాల్లోని ఇళ్లు దెబ్బతిన్నాయని, భారీగా ఆస్తి నష్టం జరిగిందని బాగ్లాన్‌లోని ప్రకృతి విపత్తు నిర్వహణ ప్రాంతీయ డైరెక్టర్ ఎదయతుల్లా హమ్దార్ద్ చెప్పారు. రాజధాని కాబూల్‌ను కూడా ఆకస్మిక వరదలు ముంచెత్తాయని ప్రకృతి విపత్తు నిర్వహణ రాష్ట్ర మంత్రిత్వ శాఖ తాలిబాన్ ప్రతినిధి అబ్దుల్లా జనన్ సైక్ తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌పైనే ప్రధానంగా దృష్టి సారించామని, ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని వెల్లడించారు. కాగా, గత నెలలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ వరదల్లో దాదాపు 2,000 ఇళ్లు, 3 మసీదులు, 4 పాఠశాలలు దెబ్బతిన్నాయి. ఈ సారి కూడా అలాగే జరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకు కేవలం 50 మంది మాత్రమే మృతిచెందినట్లుగా ప్రకటించినా.. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
-
Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
-
Srikanth Odela:రోజుకో అప్డేట్ అంటే చిరాకు!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!