NTV Telugu Site icon

Rains Alert: ఇవాళ రాత్రికి భారీ వర్షాలు.. కలెక్టర్లను అలర్ట్ చేసిన సీఎస్

Rains

Rains

తెలంగాణలో ఇవాళ పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వెదర్ డిపార్ట్మెంట్ పేర్కొనింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అప్రత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్‌ ఆయా జిల్లాల కలెక్టర్‌లను అలర్ట్ చేసింది. కలెక్టరేట్లలో కంట్రోల్‌ రూమ్‌లను వెంటనే ఏర్పాటు చేసి, మానిటర్‌ చేస్తూ ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

Read Also: Bheemadevara Pally Branchi: ఓటీటీలోకి వచ్చేసిన భీమదేవరపల్లి బ్రాంచి.. ఎందులో స్ట్రీమ్ అవుతోందంటే?

ఇదిలా ఉండగా.. వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో నిన్న(గురువారం) ఏర్పడిన అల్పపీడనం చురుగ్గా ఉందని, రాగల రెండుమూడు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశలో ఉత్తర ఒడిశా-ఉత్తర ఛత్తీస్ గఢ్ వైపు వెళ్లే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.

Read Also: Onion Price: ఇక ఉల్లి వంతు..! పై పైకి పాకుతోన్న ధర

దీని ప్రభావం వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాబోయే రెండు రోజుల పాటు ఉతర తెలంగాణల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే సిబ్బంది అలర్ట్ చేశారు. ఎలాంటి పరిస్థితులు వచ్చిన ప్రజలకు ఇబ్బంది కలుగకూండా తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో ఎస్డీఆర్ఎఫ్, రెస్య్కూ టీమ్ లను అధికారులు సిద్దం చేశారు.