హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. ఈదురు గాలులతో కూడిన వానా పడుతుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్ పేట, కూకట్ పల్లి, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, సికింద్రాబాద్, ఈసీఐఎల్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్, నారాయణ గూడలో వర్షం కురుస్తుంది. అయితే.. మరో రెండు గంటల పాటు నగరంలో భారీగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
Read Also: Kushi: మ్యూజిక్ లవర్స్‌కి ‘మెలోడియస్’ అప్డేట్.. రెండో పాట రిలీజ్ ఎప్పుడంటే?
అయితే భారీ వర్షానికి నగరంలోని రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వెహికిల్స్ నెమ్మదిగా ముందుకు కదలుతున్నాయి. పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వెళ్లే రూట్ లో భారీగా వెహికిల్స్ నిలిచిపోయాయి. అటు కూకట్ పల్లి నుంచి అమీర్ పేట రూట్ లో వాహనాలు కూడా భారీగా ఆగిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే టైం కావడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు.
Read Also: AFG vs BAN: బంగ్లాదేశ్ బౌలర్లను కడిగి ఆరేసిన 21 ఏళ్ల బ్యాట్స్‌మెన్లు.. సెంచరీలతో దుమ్మురేపారు..!
ఒక వైపు వర్షం కురుస్తుంటే.. మరో వైపు భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఇంటికి వెళ్లే సరికి గంటల సమయం పడుతుందని వాహనాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొన్ని చోట్ల కరెంట్ సరఫరా నిలిచిపోయింది. వర్షానికి జనం చీకట్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరో వైపు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
