Weather Update : తెలంగాణకు భారీ వర్ష సూచన.. పడిపోయిన ఉష్ణోగ్రతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో గత వారం రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. భారీ వడగళ్ల వాన వల్ల పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అకాల వర్షాల సంక్షోభం ఎప్పటికి ముగుస్తుందా అని రైతులు ఎదురు చూస్తుండగా.. వాతావరణ శాఖ మరో ఆందోళన కలిగించే విషయం వెల్లడించింది. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ ఈ సూచనతో రైతుల్లో ఆందోళన పెరిగింది. వాతావరణ శాఖ విడుదల చేసిన సూచన ప్రకారం, నేడు, రేపు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయి. అయితే.. సోమవారం సాయంత్రం హైదరాబాద్ భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే.. హైదరాబాద్ లోనే కాకుండా.. రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
Also Read : Marvel: మూడు రోజుల్లో రిలీజ్ ఉంది కానీ బజ్ లేదు… MCU పనైపోయిందా?
Also Read
- India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
- ATM Charges: ఏటీఎం విత్‌డ్రాయల్‌పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
- Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
- Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
దీంతో పాటు కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉంది. ఇదిలా ఉంటే.. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయలో వారం పాటు భారీ వర్షాలు ఉంటాయని, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశాలో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు, పిడుగులు పడొచ్చని హెచ్చరించింది. మధ్య భారత్ లోని ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని పేర్కొంది. అలాగే, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో వడగండ్ల వానలు పడతాయని ప్రకటించింది.
Also Read : Sita Ramam: ఈ ప్రేమకావ్యం చరిత్రలో నిలిచిపోతుంది…
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్‌డ్రాయల్‌పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!