NTV Telugu Site icon

Heavy Rain Alert: ఏపీకి పొంచి ఉన్న మరో గండం.. 24 గంటల్లో తీవ్ర వాయుగుండం..!

Ap Rain

Ap Rain

పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని.. రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఒడిశాలోని పూరీ, పశ్చిమ బెంగాల్ లోని దిఘా మధ్య ఇది తీరం దాటొచ్చని ఐఎండీ అంచనా వేసింది. కాగా.. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Rajasthan: రాళ్లు వెనకేసుకోవడం అంటే ఇదేనేమో.. వ్యక్తి గాల్‌బ్లాడర్ నుంచి 6000 రాళ్లు తొలగింపు..

ఈరోజు.. అల్లూరి సీతారామరాజు, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వివరించింది. విశాఖ, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇప్పుడు భారీ వర్ష సూచనతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

Bajrang Punia: “కాంగ్రెస్‌ని వదిలిపెట్టండి. లేదంటే”.. బజరంగ్ పూనియాకు బెదిరింపు మెసేజ్

మరోవైపు.. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో సీఎం చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో పరిస్థితులు, నమోదైన వర్షపాతం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలు, సన్నద్ధతను కలెక్టర్లు చంద్రబాబుకు వివరించారు. జిల్లాలో నమోదైన వర్షపాతాన్ని అంచనా వేసుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.

Show comments