AP Weather: ఏపీకి భారీ వర్ష సూచన.. ఏలూరు, అల్లూరి జిల్లాలకు రెడ్ అలర్ట్
- ఏపీకి భారీ వర్ష సూచన
- ఉత్తరాంధ్రకు భారీ నుంచీ అతిభారీ వర్ష సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Weather: బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది రేపు తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉంది. ఆ తర్వాత వాయుగుండం క్రమంగా బలహీనపడనుంది. ప్రస్తుతం వాయుగుండం పూరీకి 70 కిమీ, గోపాలపురికి 130, కళింగపట్నానికి 240కిమీల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నట్లు ఏపీ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాయలసీమలో చెదురుమదురు వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఉత్తరాంధ్రకు భారీ నుంచీ అతిభారీ వర్ష సూచన తేసింది. ఏలూరు, అల్లూరి జిల్లాలలో అత్యధికంగా వర్షాలు పడతాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎన్టీఆర్, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలు, అమలాపురం, కోనసీమ, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది.
Read Also: World Kamma Mahasabhalu: ఈ నెల 20, 21 తేదీల్లో ప్రపంచ కమ్మ మహాసభలు
Also Read
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
రాయలసీమ జిల్లాలలో 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది… భారీ వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేసింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే అత్యవసర సహాయక చర్యల కోసం 3ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు మోహరించినట్లు ఏపీ విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్నవాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.
తాజావార్తలు
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!