Site icon NTV Telugu

Heavy Rains: జనగామ, ఖమ్మం జిల్లాలో వర్ష బీభత్సం.. భారీగా పంటనష్టం

Heavy Hailstorm

Heavy Hailstorm

జనగామ జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలులతో భారీ వడగండ్ల వాన కురిసింది. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. కొంత ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. జనగామ ,లింగాల గణపురం, రఘునాథపల్లి మండలాల్లో కురిసిన వర్షానికి పంట నేలరాలింది.
పలుచోట్ల రహదారులపై చెట్లు నేలకొరిగాయి. అకాల వర్షం రైతులను నిండా ముంచిందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని మాయిశ్చర్ లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

READ MORE: MI vs DC: వరుస విజయాల ఢిల్లీని ముంబై ఇండియన్స్ ఆపగలదా? మొదట బ్యాటింగ్ చేయనున్న ముంబై

మరోవైపు.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా ఉరుములు, మేరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో అన్నదాతలు.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం రాశులపై టార్పిన్ పట్టాలు కప్పి తడవకుండా ధాన్యం రాశులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత వారం క్రితం కురిసిన వర్షానికి కుదేలు అయిన రైతున్నలు మళ్ళీ వర్షం కురుస్తుండటంతో ఆవేదన చెందుతున్నారు. భారీ ఈదురు గాలులతో పెనుబల్లి మండలంలో విద్యుత్తు సైతం నిలిచి అంధకారంగా మారింది.

READ MORE: BJP: ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్‌పై “కన్హయ్య కుమార్” అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ ఫిర్యాదు..

Exit mobile version