జనగామ జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలులతో భారీ వడగండ్ల వాన కురిసింది. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. కొంత ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. జనగామ ,లింగాల గణపురం, రఘునాథపల్లి మండలాల్లో కురిసిన వర్షానికి పంట నేలరాలింది. పలుచోట్ల రహదారులపై చెట్లు నేలకొరిగాయి.