NTV Telugu Site icon

Hyderabad: గచ్చిబౌలిలో భారీగా గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

Ganja

Ganja

హైదరాబాద్ నగరం రోజురోజుకి మాదకద్రవ్యాలకు అడ్డాగా మారుతోందా అని అనిపిస్తోంది. కొందరు గంజాయి విక్రయించే గ్యాంగులు నగరంలో హల్చల్ చేస్తున్నాయి. ఎవరికైనా గంజాయి, డ్రగ్స్ కావాలంటే కేవలం ఫోన్ చేస్తే చాలు.. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడికి డెలివరీ చేసేలా సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా మరోసారి హైదరాబాద్ మహానగరంలో భారీగా గంజాయి పట్టుబడింది. గచ్చిబౌలిలో భారీగా గంజాయిని శంషాబాద్ డిటిఎఫ్( డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also: LPG Price Hike : సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

గచ్చిబౌలి నానక్‌రామ్ గూడాలో కారులో తరలిస్తున్న 20 కేజీల గంజాయిని అధికారులు సీజ్ చేశారు. ఒరిస్సా రాష్ట్రాం మాల్కన్‌గిరి జిల్లాకు చెందిన బిక్రం హిరా (24) హైదరాబాద్‌కి గంజాయి తరలిస్తుండగా 20 కేజీల 13 డ్రై గంజాయి ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కారు డిక్కీలో రహస్యంగా సొరగు ఏర్పాటు చేసి గంజాయి తరలిస్తున్నారు. కాగా.. నిందితుల్లో బిక్రం హిరా తప్పించుకోగా, మరో ముగ్గురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అనంతరం.. గంజాయి తరలిస్తున్న కారును అధికారులు సీజ్ చేశారు.

Read Also: Joe Root: సచిన్‌ రికార్డును బ్రేక్ చేసిన జో రూట్!

Show comments