మన దేశంలో అధికంగా పండించే కూరగాయలలో దోసకాయ కూడా ఒకటి.. ఈ పంటను రైతులు ఎక్కువగా పండిస్తున్నారు.. తీగజాతి కూరగాయల్లో దోస చాలా తక్కువ సమయంలో చేతికొచ్చే పంట.మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే ఒక మాదిరి ఉష్ణోగ్రతలు వుండే వాతావరణ పరిస్థితులు దోస సాగుకు అనుకూలం. మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటే దోసలో మగపూల శాతం పెరిగి దిగుబడి క్షీణిస్తుంది. లోతైన గరప నేలలు, ఒండ్రు నేలలు , దోస సాగుకు అనుకూలం… ఈ పంట గురించి మరిన్ని వివరాలు..
దోస రకాలు..
దోసలో కూరదోస, పచ్చిదోస రెండు రకాలున్నాయి.
కూరదోస రకాలు:
ఆర్.ఎన్.ఎస్.ఎం – 1 నీటి ఎద్దడికి తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకం. వేసవికి కూడా అనువైనది. ఈ రకం పంటకాలం 130 నుంచి 140 రోజులు. దిగుబడి ఎకరాకు 60 నుంచి 72 క్వింటాళ్లు వస్తుంది.
హైబ్రిడ్ రకాలు:
నాంధరి, 910, అభిజిత్, గోల్డెన్ గ్లోరీ, మల్టీస్టార్ మొదలైన రకాలున్నాయి..
ఎకరాకు ఒకటి నుంచి 1.4 కిలోలు, హైబ్రిడ్ రకాల్లో ఎకరాకు 250గ్రా. విత్తనం అవసరం.. విత్తన శుద్ధి చెయ్యడం అవసరం.. ఇక నేలను తయారు చేసుకోవాలి.. పొలాన్ని బాగా దుక్కి చేసి మూడు అడుగుల వెడల్పుతో ఎత్తు బోదెలు చేయాలి. బోదె మధ్యలో గాడి చేసి అందులో ఎకరానికి 5 టన్నుల చొప్పున పశువుల ఎరువు, 200 కిలోల సూపర్ ఫాస్ఫెట్, 50 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 20 కిలోల మెగ్నీషియం సల్ఫేట్, 10 కిలోల బోరాన్ వేసి గాడిని మట్టితో నింపి బోదె పైభాగాన్ని చదును చేయాలి.. అప్పుడే తెగుళ్ల నుంచి బయట పడవచ్చు.. గింజలు మొలకెత్తే వరకు వెంట వెంటనే నీరు పారించాలి. ఆ తర్వాత నేల స్వభావాన్ని, కాలాన్ని బట్టి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో నీరు ఇవ్వాలి.
కలుపును ఎప్పటికప్పుడు నివారిస్తూ ఉండాలి.. తీగను జాగ్రత్తగా చూడాలి.. గింజలు విత్తిన 45 రోజులకే కోతకు వస్తుంది. సలాడ్ కోసం పూత పూసిన 7 నుంచి 8 రోజులకే కోయాలి. వారానికి రెండు కోతలు తీసుకోవచ్చు.. అలాగే గింజలు విత్తిన 45 రోజులకే కోతకు వస్తుంది. సలాడ్ కోసం పూత పూసిన 7 నుంచి 8 రోజులకే కోయాలి. వారానికి రెండు కోతలు తీసుకోవచ్చు. కీర దోసలో ఎకరాకు 28 నుంచి 32 క్వింటాళ్లు, కూర దోసలో.. ఎకరాకు 60 నుంచి 80 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది.. ఇప్పుడు రైతులు ఎక్కువగా ఈ పంటను పండిస్తున్నారు.. మరింత సమాచారం కొరకు వ్యవసాయ నిపుణులను అడిగి తెలుసుకోవాలి..