Site icon NTV Telugu

Lok sabha election: 4 రాష్ట్రాలకు హీట్ వేవ్ ఎఫెక్ట్.. 26న పోలింగ్ తగ్గనుందా?

Hele

Hele

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే తొలి విడత ప్రశాంతంగా ముగిసింది. ఇక సెకండ్ విడత పోలింగ్‌కు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. వచ్చే శుక్రవారమే సెకండ్ ఫేజ్‌లో పలు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. అయితే దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే 43 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పైగా వేడిగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా వారం రోజులు విపరీతమైన ఎండలు ఉండొచ్చని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగబోయే ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Elecations : డిపాజిట్ గల్లంతైనా ఎమ్మెల్యే అయ్యారు… ఎలాగంటే..

వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ పాటు పడతుంది. అలాగే ఇండియా కూటమి కూడా అధికారంలోకి వచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉంటే ఇంత రసవత్తరంగా పోటీ నెలకొన్న తరుణంలో ఉష్ణోగ్రతలు ఓటింగ్‌పై ప్రభావం చూపొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. శుక్రవారం రెండో విడతలో 13 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎండల కారణంగా పోలింగ్ శాతం తగ్గవచ్చేమోనని నిపుణులతో పాటు ఎన్నికల సంఘం కూడా ఆందోళన చెందుతోంది. కనీసం నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో ఈ ప్రభావం ఉండొచ్చని అంచనా వేస్తోంది.

ఇది కూడా చదవండి: Congress vs Left: రాహుల్ గాంధీకి డీఎన్ఏ టెస్ట్ చేయాలి.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

హీట్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ఎన్నకల సంఘం అప్రమత్తమైంది. ఇంకా ఆరు దిశల పోలింగ్ మిగిలి ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులతో సీఈసీ రాజీవ్ కుమార్, కమిషనర్లు సమావేశం అయ్యారు. తాజా పరిస్థితులను తెలుసుకున్నారు. ఇక అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో కూడా రాజీవ్ కుమార్ సమావేశం నిర్వహించనున్నారు. అన్ని పోలింగ్ స్టేషన్‌లలో గుడారాలు, తాగునీరు, ఫ్యాన్‌ల వంటి అవసరమైన సౌకర్యాలను పరిశీలించడానికి రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ముగిసింది. ఇక సెకండ్ విడత ఏప్రిల్ 26న జరగనుంది. అనంతరం మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇక ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

ఇది కూడా చదవండి: AP News: ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు..

Exit mobile version