Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్.. ఫైనల్‌కు చేరిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు!
- ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్
- వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు
- స్వర్ణ పతకం ఆశలు గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vinesh Phogat Miss Paris Olympics 2024 Medal: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో ఫైనల్‌కు చేరి.. పతకం ఖాయం చేసుకున్న స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. 50 కేజీల విభాగంలో ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉండడంతో ఒలింపిక్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వినేశ్ 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉంది. ఈ వేటుతో భారత్ సహా వినేశ్ స్వర్ణ పతకం ఆశలు గల్లంతయ్యాయి.
మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో ఈరోజు రాత్రి జరిగే ఫైనల్‌లో అమెరికా స్టార్ రెజ్లర్ సారా హిల్డర్‌బ్రాంట్‌తో వినేశ్ ఫొగాట్ తలపడాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె బరువును చూసిన ఒలింపిక్స్ నిర్వాహకులు 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వినేశ్‌పై ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ అనర్హత వేటు వేశాయి. నిబంధనల ప్రకారం రజత పతకానికి కూడా వినేశ్ అనర్హురాలు. 29 ఏళ్ల వినేశ్ కెరీర్ ఆరంభం నుంచి 53 కేజీల కేటగిరీలోనే పోటీ పడింది. అయితే ఒలింపిక్స్ 2024 ముందు తప్పనిసరి పరిస్థితుల్లో 50 కేజీల విభాగానికి మారాల్సి వచ్చింది.
Also Read
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్‌పై సస్పెన్స్..
- 185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
- 9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
Also Read: Manu Bhaker: స్వదేశానికి చేరుకున్న మను బాకర్.. ఢిల్లీలో ఘన స్వాగతం! శనివారం మళ్లీ పారిస్‌కు
‘దురదృష్టవశాత్తు వినేశ్ ఫొగాట్ 50 కేజీల విభాగం నుంచి అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటు పడింది. దయచేసి వినేశ్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని మేం విజ్ఞప్తి చేస్తున్నాం. అనర్హత వేటు వార్తలను పంచుకోవడం అత్యంత బాధాకరం’ అని భారత ఒలింపిక్ సంఘం పేర్కొంది.
తాజావార్తలు
-
Jani Master: తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. జానీ మాస్టర్‌కు ఊహించని షాక్!
-
Hombale Films: ‘కేజీఎఫ్’ నుంచి ‘మహా అవతార్’ వరకు.. హోంబలే ఫిల్మ్స్ భారీ ప్లాన్‌తో ఇండియన్ సినిమాకు కొత్త దిశ
-
RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్‌పై సస్పెన్స్..
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!