6 హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసుల అక్రమ నిర్బంధాలపై బాధిత కుటుంబ సభ్యులు పిటిషన్లు వేశారు. ఈ క్రమంలో న్యాయస్థానం విచారణ చేపట్టింది. అక్రమంగా నిర్బంధించిన ఆరుగురు ఎక్కడున్నారో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు కోర్టు ఆదేశించింది. లోకేష్ అనే సోషల్ మీడియా ప్రతినిధి హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణలో ఎస్సై జానకి రామయ్య కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో.. ఎస్సై జానకి రామయ్య స్టేట్‌మెంట్‌ను న్యాయస్థానం రికార్డు చేసింది. ఈ నెల 5వ తేదీన లోకేశ్ అనే వ్యక్తిని పోలీసులు తీసుకువెళ్లిన తర్వాత.. ఇంటికి రాలేదని లోకేష్ పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తాము లోకేష్‌కు 41ఏ నోటీసు ఇచ్చి వదిలేశామని పోలీసులు కోర్టుకు తెలిపారు.
Read Also: Bangalore KGF: కేజీఎఫ్‌లో కేవలం 5 సెకన్లకే కుప్పకులిన భవనం (వీడియో)
సోమవారం లోకేష్‌ను పదిన్నర గంటలకు కోర్టులో లోకేష్‌ను హాజరు పరచాలని పోలీసులను ఆదేశించారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. జింకల రామాంజనేయులు హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా అతనికి రిమాండ్ విధించినట్టు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ కేసులో కూడా సీసీ టీవీ ఫుటేజ్ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. మిగతా వారిని వదిలిపెట్టినట్టు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ కేసులో అభ్యంతరాలు ఉంటే సోమవారం తెలపాలని.. తదుపరి విచారణ ఏపీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
Read Also: Bengal doctor: హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో బెంగాల్ డాక్టర్ మృతి..