ఫిలిమ్ నగర్ లోని దక్కన్ కిచెన్ కూల్చివేత పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది. కాగా ఈ కేసులో ఇప్పటికే సినీ నటులు వెంకటేశ్‌తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానాపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు హీరో దగ్గుబాటి వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, హీరో రానా పై ఫిల్మ్ నగర్ పోలీసులు 448, 452,458,120 బీ సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఫిలిమ్ నగర్ లోని దక్కన్ కిచెన్ కూల్చివేతపై విచారణకు రాకుండా కాలయాపన చేస్తున్నా దగ్గుపాటి సురేష్, వెంకటేష్, రానా పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్టు1న కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. నేడు విచారణ కు హాజరువుతారా లేదా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. న్యాయ స్థానం ఆదేశాలు బేఖాతరు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
Also Read:AP Liquor Scam Case: విజయవాడ ఏసీబీ కోర్టుకు ఎంపీ మిథున్ రెడ్డి
గతంలో నంద కుమార్‌కు చెందిన దక్కన్ కిచెన్ హోటల్ అంశంలో దగ్గుబాటి కుటుంబంతో స్థలం వివాదం చెలరేగింది. దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. దీంతో ఈ విషయం కోర్టు పరిధికి చేరింది. కాగా, 2022 నవంబరులో జీహెచ్ ఎంసీ సిబ్బంది.. బౌన్సర్లతో కలిసి హోటల్‌ను పాక్షికంగా ధ్వంసం చేశారు. సదరు స్థలంలో ఎలాంటి చర్యలకు దిగొద్దన్న హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయలేదు. 2024 జనవరిలో హోటల్‌ను దగ్గుబాటి కుటుంబం దౌర్జన్యంతో పూర్తిగా కూల్చి వేసింది.. దీంతో మళ్లీ నందకుమార్ వీరిపై కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టుకు వెళ్లగా.. ఈ కేసులో దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన హీరో వెంకటేశ్, సురేశ్ బాబు, రానా, అభిరామ్ లు తనకు చేసిన అన్యాయంపై కోర్టులో నంద కుమార్ ఏళ్లుగా పోరాడుతున్నారు.
