NTV Telugu Site icon

Chandrababu: అటు హైకోర్టు.. ఇటు ఏసీబీ కోర్టు.. చంద్రబాబు పిటిషన్లపై విచారణ

Babu

Babu

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిటిషన్లపై హైకోర్టుతో పాటు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఈ రోజు విచారణ జరగనుంది.. నేడు ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ సాగనుంది.. అంగళ్లులో దాడి ఘటనలో ముదివీడు పోలీసులు నమోదు చేసిన కేసులో చంద్రబాబు ఏ1 గా ఉండగా.. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.. దీనిపై ఈ రోజు విచారణ జరగనుంది.. మరోవైపు.. చంద్రబాబు కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్ లపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.. కస్టడీ పిటిషన్ పై నేడు కౌంటర్ దాఖలుచేయనున్నారు చంద్రబాబు తరపు న్యాయవాదులు.. ఇక, బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్ లపై నేడు కౌంటర్ వేయనుంది సీఐడీ..

Read Also: Andhra Pradesh Crime: వినాయక విగ్రహం విషయంలో ఘర్షణ.. ఒకరు మృతి, 10 మందికి గాయాలు

కాగా, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్‌ 11వ రోజుకు చేరుకుంది.. ఇక, తొమ్మిది రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు చంద్రబాబు.. ఇవాళ ములాఖత్‌లో రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబును కలవనుంది టీడీపీ లీగల్‌ సెల్.. సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసేందుకు వెళ్లనున్నారు ఆయన తరుపున న్యాయవాదులు.. మరోవైపు.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు, రింగ్‌రోడ్డు కేసులో విచారణ ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం విదితమే.. టెరాసాఫ్ట్‌ కంపెనీకి ఫైబర్‌ నెట్‌ కాంట్రాక్ట్‌ కేటాయింపులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ పిటీ వారెంట్‌ జారీ చేసింది. ఈ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఇదిలా ఉండగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుపై దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో నిన్న వాదనలు ముగియగా.. తీర్పును హైకోర్టు రిజర్వు చేసిన విషయం విదితమే.