Chandrababu: అటు హైకోర్టు.. ఇటు ఏసీబీ కోర్టు.. చంద్రబాబు పిటిషన్లపై విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిటిషన్లపై హైకోర్టుతో పాటు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఈ రోజు విచారణ జరగనుంది.. నేడు ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ సాగనుంది.. అంగళ్లులో దాడి ఘటనలో ముదివీడు పోలీసులు నమోదు చేసిన కేసులో చంద్రబాబు ఏ1 గా ఉండగా.. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. దీనిపై ఈ రోజు విచారణ జరగనుంది.. మరోవైపు.. చంద్రబాబు కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్ లపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.. కస్టడీ పిటిషన్ పై నేడు కౌంటర్ దాఖలుచేయనున్నారు చంద్రబాబు తరపు న్యాయవాదులు.. ఇక, బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్ లపై నేడు కౌంటర్ వేయనుంది సీఐడీ..
Read Also: Andhra Pradesh Crime: వినాయక విగ్రహం విషయంలో ఘర్షణ.. ఒకరు మృతి, 10 మందికి గాయాలు
Also Read
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
కాగా, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ 11వ రోజుకు చేరుకుంది.. ఇక, తొమ్మిది రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు చంద్రబాబు.. ఇవాళ ములాఖత్‌లో రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును కలవనుంది టీడీపీ లీగల్ సెల్.. సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసేందుకు వెళ్లనున్నారు ఆయన తరుపున న్యాయవాదులు.. మరోవైపు.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు, రింగ్‌రోడ్డు కేసులో విచారణ ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం విదితమే.. టెరాసాఫ్ట్ కంపెనీకి ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ కేటాయింపులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ పిటీ వారెంట్ జారీ చేసింది. ఈ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఇదిలా ఉండగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుపై దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో నిన్న వాదనలు ముగియగా.. తీర్పును హైకోర్టు రిజర్వు చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!