NTV Telugu Site icon

AP High Court: చంద్రబాబు, నారాయణ ముందస్తు బెయిల్‌ పిటిషన్లు.. నేడు హైకోర్టులో విచారణ

Ap High Court

Ap High Court

AP High Court: టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ బెయిల్‌ పిటిషన్‌ న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది. అంగల్లు ఘటనలో ఏ1 గా ఉన్న చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ నేడు విచారణకు లిస్ట్ అయింది. ఇదిలా ఉండగా.. ఇవాళ పవన్‌ కల్యాణ్‌, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చంద్రబాబుతో ములాఖత్‌కు వెళ్లనున్నారు. ఒకేసారి చంద్రబాబును జైలులో కలవనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుతో బాలయ్య, పవన్, లోకేష్ ములాఖత్ కానున్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సెంట్రల్ జైలుకు రానున్నారు. అదే సమయానికి క్యాంపు నుంచి సెంట్రల్ జైలుకు బాలయ్య, లోకేష్ రానున్నారు. ములాఖత్ తర్వాత జైలు దగ్గర ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. నేడు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ రానున్న నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భద్రతను పెంచారు. 300 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రభుత్వాసుపత్రి , ఆర్ట్స్ కాలేజీల వద్ద భారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు దారి మళ్లింపు చేపట్టారు. ఎయిర్‌పోర్టు నుంచి సెంట్రల్ జైలు వరకు ప్రధాన జంక్షన్ల వద్ద పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. ముగ్గురు కలిసి 11:30 తర్వాత చంద్రబాబుతో ములాఖత్ కానున్నట్లు సమాచారం. ములాఖత్ తర్వాత నేరుగా రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి హైదరాబాద్ పవన్ వెళ్లనున్నారు.

Also Read: AP CM Jagan Tour: రేపు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు పిటిషన్

ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు పిటిషన్ దాఖలు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో ఇప్పటికే నారాయణకు మెడికల్ గ్రౌండ్స్ మీద మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఏ తరుణంలోనే ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు పిటిషన్ దాఖలు చేశారు. ఇక నేడు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఇవాళ ముందస్తు బెయిల్ తుది విచారణ చేపట్టనుంది న్యాయస్థానం.