Site icon NTV Telugu

Supreme Court: బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పిటిషన్.. నేడు విచారణ..! 

Supreme Court

Supreme Court

Lok Sabha Election 2024: బ్యాలెట్ పేపర్ ( Ballot Paper ) ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు ( Supreme Court ) నేడు (శుక్రవారం) విచారించనుంది. లోక్‌సభ ఎన్నికల ( Lok Sabha Election )ను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించేలా భారత ఎన్నికల సంఘా ( EC )న్ని ఆదేశించాలని పిటిషన్‌లో కాంగ్రెస్ ( Congress ) పార్టీ డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు ( Supreme Court ) వెబ్‌సైట్‌లో ప్రచురించిన కారణాల జాబితా ప్రకారం.. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ కేసును విచారించనుంది. ఈవీఎంలపై ప్రతిపక్ష పార్టీల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ మధుర జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Read Also: WPL 2024: నేడు ముంబై, బెంగళూరు మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్.. ఢిల్లీని ‘ఢీ’ కొట్టేదెవరు?

కాగా, ఇందులో ఈవీఎంల ( EVMS) ద్వారా ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌కు హక్కు కల్పించే ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 61ఏను రద్దు చేయాలని కాంగ్రెస్ (Congress) పార్టీ విజ్ఞప్తి చేసింది. బూత్ క్యాప్చరింగ్, బ్యాలెట్ బాక్సులను అడ్డుకోవడం, అక్రమ ఓట్లు, పేపర్ వృధా లాంటి బ్యాలెట్ పేపర్‌పై ( Ballot Paper ) వాదనలు అన్యాయమైనవి అని తెలిపింది. అయితే ఈవీఎం ( EVMS) మెషీన్‌లో 2,000 నుంచి 3,840 ఓట్లు నిల్వ ఉన్నాయని పిటిషన్‌లో చెప్పుకొచ్చింది. అంటే ప్రత్యక్ష ఎన్నికల విధానంలో ఒక్కో నియోజకవర్గానికి 50 ఈవీఎం ( EVMS) మిషన్ల డేటాను తారుమారు చేయడం ద్వారా లక్ష నుంచి 1.92 లక్షల ఓట్ల వరకు మోసం జరిగే అవకాశం ఉంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈవీఎం లేదా బ్యాలెట్ పేపర్‌తో సంబంధం లేకుండా ఎన్నికల ఫలితాలు ఒకే విధంగా ఉండటంతో ఈవీఎంల పనితీరుపై, అలాగే అధికార పార్టీపై అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నదని కాంగ్రెస్ (Congress) పిటిషన్‌లో పేర్కొనింది. ఈ పిటిషన్ ను నేడు సుప్రీంకోర్టు ( Supreme Court ) ధర్మాసనం విచారణ చేయనుంది.

Exit mobile version