Ragi cakes Recipe: జంక్ ఫుడ్‌కు బై బై… హెల్తీ ‘రాగి కేక్’ ట్రై చేయండి ఇంట్లోనే ఇలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi cakes Recipe: ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో.. రుచితో పాటు పోషక విలువలు కూడా అందించే వంటకాలకు బాగా ప్రాధాన్యం పెరిగింది. అలాంటి హెల్తీ స్వీట్స్ లో రాగితో చేసే వంటకాలు ప్రత్యేక స్థానం పొందాయి. ఇందులో భాగంగానే రాగిపిండి, బెల్లంతో తయారు చేసే ఎగ్‌లెస్ రాగి కప్ కేక్స్ రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి అవసరమైన కాల్షియం, ఐరన్ వంటి పోషకాలను అందిస్తాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ కప్ కేక్స్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హెల్తీ, టేస్టీ రాగి కప్ కేక్స్ తయారీ విధానం తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
* రాగి పిండి: 1 కప్పు
* గోధుమ పిండి: 1 కప్పు
* బెల్లం: 1 కప్పు (తురిమినది)
* నూనె: 1/2 కప్పు
* పెరుగు: 1/2 కప్పు (రూమ్ టెంపరేచర్‌లో)
* పాలు: 1/2 కప్పు (కాచి చల్లార్చినవి)
* కోకో పౌడర్: 3 టేబుల్ స్పూన్లు
* బేకింగ్ పౌడర్: 1 టీస్పూన్
* బేకింగ్ సోడా: 1/2 టీస్పూన్
* వెనీలా ఎసెన్స్ లేదా యాలకుల పొడి: 1/4 టీస్పూన్
* ఉప్పు: తగినంత
* నీరు: 2 టేబుల్ స్పూన్లు
Also Read
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
తయారీ విధానం:
బెల్లం సిరప్ తయారీ:
ముందుగా ఒక గిన్నెలో బెల్లం తురుము, నీరు వేసి వేడి చేయాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత సిరప్ ను వడకట్టి పూర్తిగా చల్లారనివ్వాలి.
బేకింగ్:
ఇంట్లోనే ఉండే చిన్న గిన్నెలకు నూనె రాసి, కొంచెం గోధుమ పిండితో డస్ట్ చేసుకోవాలి. లేదా కప్ కేక్ లైనర్స్ ఉపయోగించవచ్చు. ఆ తర్వాత కుక్కర్ లేదా పెద్ద గిన్నెలో ఒక స్టాండ్ ఉంచి, 10 నిమిషాల పాటు తక్కువ మంటపై ప్రీ-హీట్ చేసుకోవాలి.
Pawan Kalyan: రామతీర్థం గిరిప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం..!
కేక్ బ్యాటర్ తయారీ:
ఒక మిక్సింగ్ బౌల్ లో నూనె, చల్లారిన బెల్లం సిరప్, వెనీలా ఎసెన్స్ (లేదా యాలకుల పొడి) వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పెరుగు వేసి ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు ఒక జల్లెడలో రాగి పిండి, గోధుమ పిండి, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి జల్లించుకోవాలి. ఈ మిశ్రమంలో పాలు కొద్దికొద్దిగా పోస్తూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపాలి.
ఇలా తయారు చేసిన బ్యాటర్‌ను గిన్నెల్లో సగం వరకు నింపాలి. ఈ గిన్నెలను ప్రీ-హీట్ చేసిన కుక్కర్ లో ఉంచి, మూత పెట్టి 30 నుండి 35 నిమిషాల పాటు తక్కువ నుంచి మీడియం మంటపై బేక్ చేయాలి. అలా చేసిన తర్వాత టూత్‌పిక్ లేదా చాకుతో గుచ్చి చూస్తే క్లీన్‌గా వస్తే కేక్ ఉడికినట్లే. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత అంచులను చాకుతో లూజ్ చేసి ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే.. ఎంతో సాఫ్ట్‌గా ఉండే హెల్దీ రాగి కప్ కేక్స్ సిద్ధం.
తాజావార్తలు
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?