Health Tips: వామును ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన వంట గదిలో ఉండే మసాలా దినుసుల్లో వాము ఒకటి.. దీన్ని వంటల్లో వాడడంతో పాటు ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు. వాము మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక్కసారి తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.. వామును రోజు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వాములో సోడియం, విటమిన్ ఎ, విటమిన్ బి9, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటి ఆక్సిడెంట్లు ఇలా అనేక ఎన్నో పోషకాలు ఉన్నాయి.ఈ వాములో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వామును తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి జీర్ణ సమస్యలు దూరమవుతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది. వామును తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉండడంతో పాటు శరీరంలో ఉండే కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరాయిడ్ స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. వామును తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. వామును తీసుకోవడం వల్ల శరీరం శుభ్రపడుతుంది.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ ల కారణంగా వచ్చే కడుపు నొప్పితగ్గుతుంది. వాములో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్ లను తగ్గించడంలో వాము అద్భుతుంగా పని చేస్తుంది… అలాగే నెలసరి లో మహిళలకు వచ్చే నొప్పులు కూడా వాము వల్ల తగ్గుతుంది.. వామును వంటల్లో వాడడంతో పాటు వాము నీటిని తయారు చేసుకుని వాడడం వల్ల మనం ఈ ప్రయోజనాలన్నింటిని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ వామును వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని 5 నిమిషాల పాటు మరిగించి ఆ తరువాత వడకట్టుకుని తాగాలి..ఈ నీటిని తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను మనం దూరం చేసుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు…
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!