Health Tips : చక్కెరను ఎక్కువగా తింటే క్యాన్సర్ వస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వీట్స్.. ఈ పేరు వినగానే చాలా మందికి కళ్ల ముందే కనిపిస్తాయి.. వీటిని ఇష్టపడని వాళ్ళు ఉండరు.. ఎందుకంటే ప్రతి ఒక్క స్వీట్ లో పంచదార లేకుండా అసలు ఉండవు.. అయితే పంచదారను ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. షుగర్ పేషెంట్లు మాత్రం అస్సలు వీటి జోలికి వెళ్ళకూడదు అని అంటున్నారు. మధుమేహం మాత్రమే కాదు అనేక విధమైన రోగాలు వస్తాయని చెబుతున్నారు.. ఇప్పుడు దానికన్నా ప్రమాదమైన వ్యాధులు వస్తాయని తాజా సర్వేలో వెల్లడైంది.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మాములుగా టీ, కాఫీ, స్వీట్లు ఇలా మనం నిత్యజీవితంలో చక్కెరను వాడుతూ ఉంటాం. చాలామంది షుగర్ ఎక్కువ వేసుకుని మరీ టీ, కాఫీలు తాగుతుంటారు. ఇక కొందరు ఏకంగా స్వీట్లు ఎక్కువగా తింటుంటారు. కేకులు, చాక్లెట్లు, ఐస్క్రీంలరూపంలో ఒంట్లోకి అదనపు చక్కెర చేరిపోతుంది. చక్కెర తో చేసిన వాటిని అతిగా తీసుకోవడం వల్ల అధిక బరువును పెరిగే అవకాశం ఉంటుంది. ఆ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు.. చక్కెరను మితి మీరి తీసుకుంటే క్యాన్సర్ కూడా వస్తుందని బెల్జియం నిపుణులు తాజా పరిశోధనలో వెల్లడించారు..
Also Read
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
- Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
- Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
చక్కెరను ఎక్కువగా వాటితే శరీరంలో క్యాన్సర్ గడ్డలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అతిగా చక్కెర వాడినవారిపై తొమ్మిదేళ్ల సుదీర్ఘ అధ్యయనం చేశారు. అధ్యయనాల ప్రకారం ఈ అభిప్రాయానికి వచ్చినట్లు వారు వెల్లడించారు. తినుబండారాలు, మిఠాయిలు, ఇతరత్రా ఆహార పదార్థాల ద్వారా శరీరంలోకి చేరిన తర్వాత చక్కెర పులిసిపోతుంది. చక్కెరను తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలు శక్తిని పొందుతాయని పరిశోధనల్లో గుర్తించారు. అయితే క్యాన్సరేతర కణాలపై పులిసిపోయిన చక్కెర ప్రభావం ఉండదని వారు ధృవీకరించారు.. అందండి సంగతి.. తియ్యగా ఉండే చక్కెర వల్ల ఎన్ని ప్రమాదాలు వస్తాయి.. ఇప్పటినుంచి కాస్త దూరంగా ఉండండి.. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి…
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!