చాలా మందికి రాత్రి పూట పాలు తాగడం అలవాటు ఉంటుంది.. కొన్నిసార్లు సాధారణ పాల కంటే పోషకాలు కలిపిన పాలు తాగడం వల్ల అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.. ఒక గ్లాస్ పాలల్లో జాజీకాయ పొడి వేసుకొని తాగితే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం..
వంటగదిలో తప్పక ఉండే మసాలా. ఆయుర్వేదంలో ఆరోగ్యానికి ఇది ఒక వరం అని చెప్పబడింది. జాజికాయను పాలలో కలిపి తాగడం వల్ల శరీరానికి ఎంతో శక్తిని అందించడంతో పాటు అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. వీటిలో ఎక్కువగా ఐరన్ ఫాస్పరస్, కాపర్, మెగ్నీషియం సహా అనేక రకాల పోషకాలు ఇందులో లభిస్తాయి. దీన్ని పాలలో కలిపి సేవిస్తే కీళ్లనొప్పుల సమస్య నుంచి ఉపశమనం పొందడం మాత్రమే కాదు ఉదర సంబంధిత సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు..
గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.ఈ కాయలు క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నందున, పాలతో కలిపి తాగడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుంది. రాత్రిపూట నిద్ర సరిగా పట్టని వారు, అలసటగా ఉన్నవారు ముఖ్యంగా జాజికాయ కలిపిన పాలు తాగాలి.. రాత్రిపూట పాలతో కలిపి తాగితే టెన్షన్, స్ట్రెస్, యాంగ్జయిటీ వంటి సమస్యలు దూరమై మనసుకు ఉపశమనం కలుగుతుంది.. ఇంకా అనేక సమస్యలు దూరం అవుతాయాని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.