NTV Telugu Site icon

Health Tips: మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే అది వాడండి..!

Pimples

Pimples

Health Tips: మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా.. అవి పోవాలంటే ఎలాంటి చిట్కాలు వాడుతున్నారు.. ఎన్ని మందులు, క్రీమ్ లు వాడిన అలానే ఉంటున్నాయా..? మొటిమలు పోవడానికి పరిష్కారమేంటీ..? దాదాపు ఎక్కువగా ట్రీనేజ్ లో ఉండే యువతలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే వారు ముఖం మీద మొటిమలు గలీజుగా కనిపిస్తుండటంతో రకరకాల క్రీమ్ లు వాడుతుంటారు. అయితే మొటిమలు పోవాలంటే ఆ చిట్కా వాడాలని సూచిస్తున్నారు. అదేంటో తెలుసుకుందాం.

Read Also: WTC Final 2023: అరుదైన ఘనత సాధించిన ఐదుగురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. ఆల్‌ ఫార్మాట్‌ సూపర్‌ స్టార్స్‌!

దాదాపు మానవుల్లో అందరు ఎదుర్కోనే సమస్యనే ఇది. అయితే వారి స్కిన్ ప్రాబ్లమ్ వల్ల మొటిమలు రావడం మొదలవుతాయి. ముఖ్యంగా ఎండాకాలంలో మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటిని వదిలించుకోవడానికి ఫేస్ క్రీమ్ లు వాడతారు. మరికొందరు ఇంటి చిట్కాలు వాడతారు. మొటిమల నివారణకు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కో టిప్ వాడుతుంటారు. అందులో ఒకటి మొటిమలపై టూత్‌పేస్ట్‌ని రాయడం. దీనిని రాస్తే మొటిమలు మాయమవుతాయని చెబుతారు. అసలు టూత్ పేస్ట్ తో మొటిమలు మాయమవుతాయా.. తెలుసుకుందాం

Read Also: Cyclone Biparjoy: ప్రధాని మోడీ హైలెవల్ మీటింగ్.. బిపర్జోయ్ తుఫాన్ను ఎదుర్కొనే దానిపై సమీక్ష

మొటిమలపై టూత్‌పేస్ట్‌ని రాయడం వల్ల.. త్వరగా తగ్గిపోతాయని అంటారు. కానీ, దానిలో ఉండే అనేక పదార్థాలు చర్మాన్ని డ్రైగా చేస్తాయి. టూత్ పేస్ట్ లో ట్రైక్లోసన్ యాక్నే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. టూత్‌పేస్ట్‌లో మొటిమలను నయం చేసే గుణాలు ఉన్నప్పటికీ, మొటిమలని తగ్గించేందుకు దీనిని వాడడం ప్రమాదకరమని స్కిన్ స్పెషలిస్ట్ చెబుతున్నారు. అంతేకాకుండా బేకింగ్ సోడా, ఆల్కహాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి అనేక కెమికల్స్ ఉంటాయి. ఇవి మొటిమలని ఎక్కువ అయ్యేలా చేస్తాయి. కాబట్టి, మీరు మొటిమలను నయం చేసేందుకు టూత్‌పేస్ట్‌ని ఆపేయడం మంచిది.
టూత్‌పేస్ట్ అనేది దంతాలకి మాత్రమే వాడాలని.. ముఖానికి కాదని అంటున్నారు నిపుణులు. దానిలోని కెమికల్స్ దంతాలకు మంచిది కానీ, చర్మానికి సురక్షితం కాదని చెబుతున్నారు.