ఎండాకాలం రాకముందే భానుడి వేడి రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.. దాహన్ని తీర్చుకోవడానికి అందరు రకరకాల జ్యూస్ లను తాగుతుంటారు.. అందుకే ఎక్కువ మంది చెరుకురసాన్ని తాగుతారు.. డీహైడ్రేట్ కాకుండా ఉంటారు. అయితే, ఈ టైమ్‌లో చాలా మంది జ్యూస్‌లు తాగుతుంటారు. మరి అవి హెల్దీగా కూడా ఉండాలిగా.. ఈ చెరుకు రసాన్ని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
చెరకురసంలో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి బాడీకి శక్తిని అందిస్తాయి. ఓ గ్లాసు చెరకు రసం తాగితే మన శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గుతుంది.. అంతేకాదు డీహైడ్రేషన్ సమస్య కూడా తగ్గుతుంది.. బాడీలో క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా, వృద్ధి చెందకుండా నిరోధించే గుణం చెరకు రసంలో ఉంది.. క్యాన్సర్ వ్యతిరేక గుణాలు ఉన్న ఈ చెరకు రసాన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది.. ఏదైనా లిమిట్ గా తీసుకోవాలని తెలుసుకోండి..
యాంటీ ఆక్సిడెంట్స్, మెగ్నీషియం, ఐరన్, ఇంకా మరెన్నో పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన చర్మానికి చాలా మంచివి. శరీర బలాన్ని పెంచి ఇమ్యూనిటీని బలంగా చేస్తాయి. అంతేకాకుండా బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది.. చర్మ సమస్యలు దూరం అవ్వడంతో వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి.. ఇంకా ఎన్నో సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.