మానవాళి ముంగిట అతిపెద్ద సంక్షోభం !!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ప్రపంచం అతిపెద్ద గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది.ఇప్పటివరకూ కోవిడ్ తో సతమతమైన ప్రపంచ దేశాలు.. అంతకన్నా అతిపెద్ద సమస్యనే ఎదుర్కోవాల్సి ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలే కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఓ పేషెంట్.. క్లైమేట్ చేంజ్ వ్యాధి లక్షణాలతో అడ్మిటయ్యాడు. అతడి రోగ లక్షణాలపై పరిశోధన చేసిన డాక్టర్ మెరిట్..వాతావరణ మార్పుతో బాధపడుతున్నట్లు గుర్తించారు.శ్వాస సమస్యతో వచ్చిన రోగిని పరిశీలించిన డాక్టర్ మెరిట్.. అతడు వాతావరణ మార్పుల కారణంగా ఇబ్బంది పడుతున్నట్లు నిర్ధారించారు.
పేలవమైన గాలినాణ్యత, హీట్‌వేవ్.. రోగి లక్షణాలకు కారణమని తేల్చారు. ఇటీవల కూటేనస్లో చెలరేగిన కార్చిచ్చుల కారణంగా రోగికి ఆస్తమా తీవ్రరూపం దాల్చడంతో… శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు ఓ అంతర్జాతీయ మీడియా తెలిపింది. కార్చిచ్చు అధికంగా సంభవించే ప్రాంతాల్లో బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని కూటెనేస్ ఒకటి. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,600కు పైగా అగ్నిప్రమాదాలు జరిగాయని వైల్డ్‌ఫైర్ సర్వీస్ వెబ్సైట్ వెల్లడించింది. షుగర్, హార్ట్ ప్రోబ్లమ్స్‌ను హీట్‌వేవ్స్ పెంచాయని, ఇప్పటికే ఇలాంటి చాలా కేసులు చూస్తున్నట్లు ఈ ప్రాంతంలోని వైద్యులు చెబుతున్నారు.బ్రిటీష్ కొలంబియాలోని లిట్టన్ గ్రామంలో ఈ ఏడాది జూన్ 29న ఆల్ టైమ్ హై 49.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. వడగాడ్పుల కారణంగా వందలాది మంది చనిపోయారు. వాతావరణ మార్పుల కారణంగా… 2030 మరియు 2050 మధ్య ఏటా రెండున్నర లక్షల మంది చనిపోతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
Also Read
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
- Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
తాజావార్తలు
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!