NTV Telugu Site icon

Disadvantages Of Yogurt: పెరుగుతో పాటు వీటిని అస్సలు తినొద్దు.. భారీ మూల్యం తప్పదు!

Raita

Raita

Onion, Milk and Urad Dal Do Not Eat With Curd: ‘పెరుగు’లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం వంటి అవసరమైన పోషకాలకు పెరుగు మంచి మూలం. పెరుగును రోజూ తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. అంతేకాదు అందానికి దోహదపడుతుంది. అందుకే పెరుగును రోజూ తీసుకోవడం మంచిది. అయితే పెరుగుతో పాటు పొరపాటున కూడా తినకూడనివి కొన్ని పదార్థాలు ఉన్నాయి. పెరుగుతో ఏయే పదార్థాలు తినకూడదో (Disadvantages Of Yogurt) ఇప్పుడు చూద్దాం.

ఉల్లిపాయ:
రైతాలో అనేక రకాల కూరగాయలను ఉపయోగిస్తారు. చాలా మంది ఉల్లిపాయలతో పాటు పెరుగు తింటారు. కానీ అది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పెరుగును ఉల్లిపాయతో కలిపి తీసుకోవడం వల్ల కడుపు, అలర్జీలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అందుకే పెరుగును ఉల్లిపాయతో కలిపి తినకూడదు.

Also Read: SIIMA Awards 2023: సైమా వేడుకలకు ముహూర్తం ఫిక్స్.. హోస్ట్‌గా టాలీవుడ్ హీరో!

ఉరాద్ పప్పు:
పెరుగు పొట్టకు చాలా మేలు చేస్తుంది. అయితే పెరుగు కొన్ని వస్తువులతో కలిపి మాత్రం తినకూడదు. పెరుగును ఉరాద్ పప్పుతో కలిపి తీసుకుంటే.. కడుపులో గ్యాస్, ఉబ్బరం, వాపు, మలబద్ధకం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఉరాద్ పప్పుతో పెరుగును కలిపి తినకూడదు.

పాలు:
పెరుగుతో పాలు తీసుకోవడం మంచిది కాదు. రెండింటిని ఒకేసారి తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం మరియు వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అందులకే పాలు మరియు పెరుగు కలిపి తీసుకుంటే జాగ్రత్తగా ఉండాలి. అలా నిత్యం తీసుకుంటే మీ ఆరోగ్యం చెడిపోతుంది.

Also Read: IND vs WI: భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు వెస్టిండీస్‌ జట్టు ప్రకటన.. బాహుబలి రీఎంట్రీ!

Show comments