NTV Telugu Site icon

Onions: ఉల్లిపాయలు తింటే ఆరోగ్యానికి లాభాలెన్నో..!

Onions

Onions

కొందరు కూరలో వేసిన ఉల్లిపాయలను తీసి పక్కన పెడుతుంటారు. కానీ ఉల్లిపాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో యాంటీ ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఉల్లిపాయలు కడుపులో మంటను నివారించడానికి, ట్రైగ్లిజరైడ్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా గుండె జబ్బులు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

Rain Effect : ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న మోరంచపల్లి

ఉల్లిపాయలలో క్వెర్సెటిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించడానికి తోడ్పడుతుంది. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఉన్న 54 మంది మహిళలపై జరిపిన ఒక అధ్యయనంలో.. రోజుకు 80-120 గ్రాముల ఉల్లిపాయలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని కనుగొన్నారు. అంతేకాకుండా ఉల్లిపాయలతో పాటు వెల్లుల్లి కూడా కడుపు, పెద్దప్రేగు క్యాన్సర్లతో సహా కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 2014లో 16 అధ్యయనాల సమీక్షలో.. ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తినేవారికి పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 15% తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు.

Tamanna Bhatia : రెడ్ శారీలో కిల్లింగ్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న తమన్నా..

అంతేకాకుండా ఉల్లిలోని సల్ఫర్ కలిగిన సమ్మేళనం క్యాన్సర్ కణితి పెరగకుండా.. అండాశయ క్యాన్సర్ రాకుండా సహాయపడుతుంది. ఉల్లిపాయలో ఉండే ఫిసెటిన్, క్వెర్సెటిన్, ఫ్లేవనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు కణితి పెరుగుదలను నిరోధిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు. డయాబెటిస్ లేదా ప్రీ డయాబెటిస్ ఉన్నవారు ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తినడం అలవాటు చేసుకుంటే మంచిదని నిపుణులు పేర్కొన్నారు. ఒక అధ్యయనంలో 100 గ్రాముల ఉల్లిపాయలను తినడం వల్ల 4 గంటల తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని కనుగొన్నారు.