Site icon NTV Telugu

Tragedy : హెడ్ కానిస్టేబుల్ ఉరి వేసుకుని మృతి

Hanging

Hanging

సంగారెడ్డి పట్టణంలోని అయ్యప్ప కాలనీలో నివాసం ఉంటున్న మోకిలా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఉరి వేసుకుని మృతి చెందాడు. కొండాపూర్ మండలం మల్లేపల్లికి చెందిన మాణిక్యం(50) గత కొన్నేళ్లుగా సంగారెడ్డి పట్టణంలో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. కుటుంబ కలహాలతో ఉరివేసుకుని చనిపోయి ఉంటాడని బంధువులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : AP Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..SSC బోర్డులో ఉద్యోగాలు..

ఇదిలా ఉంటే.. సూర్యాపేట జిల్లాలోని పాలకీడు మండలం జనపహాడ్‌ వద్ద ఆదివారం 22 ఏళ్ల యువకుడు స్వయంగా నడుపుతున్న ట్రాక్టర్‌ కింద పడి మృతి చెందాడు. జాన్‌పహాడ్‌కు చెందిన తావిడబోయి శ్రీరామ్ అనే యువకుడు వ్యవసాయ పొలంలో వ్యవసాయం చేస్తుండగా అకస్మాత్తుగా మూర్ఛ వచ్చి ట్రాక్టర్‌పై నుంచి కిందపడిపోయాడు. వాహనం చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

Also Read : Posani Krishna Murali: పవన్ కళ్యాణ్ నా కెరీర్ పోగొట్టాడు.. నాకొచ్చిన నష్టమేంటి

Exit mobile version