Site icon NTV Telugu

Ram Lalla Idol: ప్రాణ ప్రతిష్టకు ముందే బాలరాముడి దర్శనం

Ram Lalla

Ram Lalla

అయోధ్యలో ప్రాణ ప్రతిష్టకు ముందే బాలరాముడి దివ్య రూపం దర్శనమిచ్చింది. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ రాముడి దివ్య రూపాన్ని విడుదల చేసింది. జనవరి 22న ఆలయ గర్భగుడిలో ఇదే విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. కాగా.. ఈ విగ్రహం కృష్ణ శిలతో తయారైంది. విగ్రహం పొడవు 51 అంగుళాలు.. బరువు 150 కేజీలు. అయితే.. బాలరాముడి విగ్రహం గురువారం గర్భాలయానికి చేరుకుంది. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన 51 అంగుళాల విగ్రహాన్ని గురువారం తెల్లవారుజామున ఆలయానికి తీసుకువచ్చారు. ప్రస్తుతం బాలరాముడి విగ్రహం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ లల్లా విగ్రహాన్ని చూసిన భక్తులు.. ‘జై శ్రీరాం, జైశ్రీరాం’ అంటూ పులకించిపోతున్నారు.

Read Also: Fire Accident : బేగంపేట్ లైఫ్ స్టైల్ బిల్డింగ్ లో అగ్నిప్రమాదం

కాశీకి చెందిన జ్ఞానేశ్వర్‌ శాస్త్రీ ఆధ్వర్యంలో ఈరోజు, రేపు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అభిజిత్ ముహుర్తంలో పుష్య, శుక్ర, ద్వాదశి 12 గంటల 20 నిమిషాల నుంచి ఒంటి గంట మధ్యలో ఈనెల 22న ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరగనుంది. సూర్య తిలకం ఆకారంలో సూర్య కిరణాలు గర్భగుడిలో పడేలా అద్దాలు రూపొందించారు.

Read Also: Ayodhya Event: రామ మందిర వేడుక వేళ రూల్స్ ఉల్లంఘించారో AI పట్టేస్తుంది..

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ఈ నెల 22న జరగనుంది. ఈ మహోత్సవానికి దాదాపు ఏడు వేల మంది హాజరవుతారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రారంభ రోజున ఆహ్వానితులను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తామని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. జనవరి 22న రామాలయంలో ‘ప్రాణ్‌ప్రతిష్ఠ’ కార్యక్రమం తర్వాత, మరుసటి రోజు సామాన్య భక్తులకు రాముడు దర్శనమివ్వనున్నారు. కాగా.. సరయూ నదీ తీరంలో నిర్మించిన రామమందిరం.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ దేవాలయం. మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపంగా నిలుస్తోంది. భవ్యరామ మందిరం అత్యంత ఖరీదైన మతపర నిర్మాణాల్లో ఒకటిగా నిలిచిపోనుంది.

Exit mobile version