Vistara Flight: హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్..

  • హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విస్తారా విమానం అత్యవసర ల్యాండింగ్
  • హైదరాబాద్ నుంచి బయల్దేరిన 20 నిమిషాల తర్వాత ఫ్లైట్ లో సాంకేతిక సమస్య
Visthara Flight

Visthara Flight

హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విస్తారా విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన 20 నిమిషాలకి సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ క్రమంలో.. గాలిలో 20 నిమిషాల తిరిగిన తర్వాత శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఢిల్లీ వెళ్తున్న విస్తారా ఫ్లైట్‌లో 180 మంది ప్రయాణికులతో వెళ్తుంది. దీంతో.. విస్తార విమానాన్ని అత్యవసరంగా ఎయిర్‌పోర్టులో పైలెట్ ల్యాండ్ చేశాడు.