కీసర పోలీస్ స్టేషన్ పరిధి యాదగిరి పల్లిలోని ఓ ఫాం హౌజ్ లో సందీప్ రెడ్డి అనే యువకుడు అనుమానస్పాద మృతిచెందాడు. నిన్న సాయంత్రం యాదగిరి పల్లిలోని ఫాం హౌజ్ కి స్నేహితులు వచ్చారు. మిత్రులందరూ రాత్రి మద్యం తాగారు. కట్ చేస్తే తెల్లవారు జామున స్విమ్మింగ్ పూల్ లో వారిలోని ఓ మిత్రుడు పడిఉన్నట్లు కనిపించింది. ఎంత లేపినా స్పందించక పోవడంతో మిగతా మిత్రులు భయపడ్డారు.
READ MORE: Mandipalli Ramprasad Reddy: ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలో ఇది స్వర్ణ యుగం…
స్విమ్మింగ్ ఫూల్ లో పడిన సందీప్ రెడ్డిని వెంటనే చిర్యల్ గ్రామంలోని విజయ్ హాస్పటిల్ కి తరలించారు. అప్పటికే సందీప్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఫాం హౌజ్ కి వచ్చిన వారు అంత కప్రాలోని బిస్ కేట్ కంపిణీలో పని చేస్తున్నారు. మిత్రుల్లో మొత్తం 12 మంది ఉన్నారు. మృతుడు సందీప్ రెడ్డి స్వస్థలం పెద్ద పెళ్లి జిల్లా ఓదెల మండలం జిలా కుంట గ్రామాం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సందీప్ రెడ్డి మృతిపై వివరాలు సేకరిస్తున్నారు. సీసీ టీవీ పుటేజీలు పరిశీలిస్తున్నారు. సందీప్ రెడ్డి మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.