NTV Telugu Site icon

HD Revanna’s Wife: హెచ్‌డీ రేవణ్ణపై కిడ్నాప్ కేసు.. ముందస్తు బెయిల్ దాఖలు చేసిన భార్య

Hd Revanna

Hd Revanna

లైంగిక నేరాల ఆరోపణల తర్వాత గత నెలలో జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణ.. తన భర్తను ఇంతకుముందు అరెస్టు చేసిన కిడ్నాప్ కేసులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. హెచ్‌డి రేవణ్ణను ఏప్రిల్ 29న ఇంటి పనిమనిషిని కిడ్నాప్ చేసిన ఆరోపణలపై ఈ నెల ప్రారంభంలో అరెస్టు చేశారు. హెచ్‌డి రేవణ్ణ కిడ్నాప్ చేసిన మహిళ తమ ఇంటిలో పని చేస్తుందని.. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కూడా అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి కుమారుడు తెలిపాడు. ఈ క్రమంలో.. హెచ్‌డి రేవన్నపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశాడు. దాని ఆధారంగా అతన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత మే 14న స్థానిక కోర్టు హెచ్‌డి రేవణ్ణను బెయిల్‌పై విడుదల చేసింది.

Pune Porsche accident: పోర్షే కార్‌ యాక్సిడెంట్‌ కేసులో జస్టిస్‌ బోర్డు ఆదేశాలపై కాంగ్రెస్ వినూత్న నిరసన

ఇదిలా ఉంటే.. హెచ్‌డి రేవణ్ణ అతని కుమారుడిపై లైంగిక నేరాల ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కస్టడీకి పంపింది. ఆ తరువాత జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. ఈ క్రమంలో.. ప్రజ్వల్ రేవణ్ణ ఈరోజు ఓ ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోతానని ప్రజ్వల్ రేవణ్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా.. ప్రతిపక్షాలు తనను ఒంటరి వాడిని చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీతో సహా ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలు తనను నిరాశకు గురిచేశాయని పేర్కొన్నారు.

Tamannah: అతనితో శృంగారాన్ని ఎంజాయ్ చేస్తా.. తమన్నా షాకింగ్ కామెంట్స్!

“నేను నా తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతున్నాను. నేను డిప్రెషన్‌లో ఉన్నాను. నేను (భారత్‌కు తిరిగి) వచ్చి మే 31 (శుక్రవారం) సిట్ (రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం) ముందు హాజరవుతాను” అని ప్రజ్వల్ రేవణ్ణ చెప్పాడు. “నేను నా శక్తి మేరకు సహకరిస్తాను. అన్ని సమాధానాలు అందిస్తాను. న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నాపై ఉన్న ఈ తప్పుడు కేసుల నుండి నేను బయటకు వస్తాను. నాకు భగవంతుడు, నా కుటుంబం యొక్క ఆశీర్వాదం ఉంది.” అని ప్రజ్వల్ రేవణ్ణ చెప్పారు.