NTV Telugu Site icon

HCA-SRH : హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్ వివాదానికి శుభం కార్డు.. దిగొచ్చిన HCA

Hca Vs Srh

Hca Vs Srh

HCA-SRH : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) , సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య కొనసాగుతున్న వివాదానికి శుభం కార్డు పడింది. బీసీసీఐ, హెచ్‌సీఏ, ఎస్ఆర్‌హెచ్ మధ్య జరిగిన ట్రైపార్టీ ఒప్పందం మేరకు ఇరు వర్గాలు పరస్పర అంగీకారంతో ముందుకు సాగేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఒప్పందం ప్రకారం, ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు ఎలాంటి ఆటంకం ఉండకూడదని హెచ్‌సీఏ స్పష్టం చేసింది.

ఒప్పందం ప్రకారం ప్రధాన అంశాలు:
కాంప్లిమెంటరీ పాసులు: పాత ఒప్పందం ప్రకారమే స్టేడియం సామర్థ్యంలో 10 శాతం కాంప్లిమెంటరీ పాసులు కేటాయించనున్నారు.

ఎస్ఆర్‌హెచ్‌కు పూర్తి సహకారం: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించేందుకు హెచ్‌సీఏ నుంచి పూర్తి సహాయ సహకారం లభిస్తుందని హామీ ఇచ్చారు.

వివాదానికి ముగింపు: గతంలో చోటు చేసుకున్న వివాదాలు ఇక ముగిసినట్టేనని హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.

ఈ చర్చలు హెచ్‌సీఏ కార్యదర్శి ఆర్. దేవ్‌రాజ్ నేతృత్వంలో జరిగాయి. ఈ సమావేశంలో ఎస్ఆర్‌హెచ్ ప్రతినిధులు కిరణ్, శరవణన్, రోహిత్ పాల్గొని ఒప్పందాన్ని ఖరారు చేశారు.  ఒప్పందంతో హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మంచి వార్త లభించినట్టైంది. ఐపీఎల్ సీజన్‌లో ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ హోం మ్యాచ్‌లు ఎలాంటి సమస్యలూ లేకుండా జరుగుతాయని ఈ సమావేశంలో స్పష్టం చేశారు.