Site icon NTV Telugu

HBD Mahesh Babu: ఏంటి భయ్యా నిజమేనా.. మన సూపర్ స్టార్ మహేష్ కు 50 ఏళ్లా?

Hbd Mahesh Babu

Hbd Mahesh Babu

HBD Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు నేడు (ఆగష్టు 9) తన 50వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. 50 ఏళ్ల వయసులోనూ తన అందం, చురుకుదనం, యంగ్ లుక్‌తో అభిమానులను మంత్ర ముగ్ధులను చేస్తున్న ప్రిన్స్‌కు, కుటుంబ సభ్యులు, సినీ సహచరులు, రాజకీయ నాయకులు, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. హిట్ సినిమాలతో పాటు తన వినయం, సేవా కార్యక్రమాలతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న మహేష్ బాబుకు ఈ ప్రత్యేక రోజున ప్రేమతో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నేడు ఆయన బర్త్‌డే సందర్భంగా బ్లాక్‌బస్టర్ ‘అతడు’ సినిమా రీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను మళ్లీ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసేందుకు సూపర్ స్టార్ అభిమానులు భారిగా అడ్వాన్సు బుకింగ్ టిక్కెట్లను కొనుగోలు చేశారు.

Trump-Netanyahu: ఫోన్‌లో ట్రంప్-నెతన్యాహు మధ్య వాగ్యుద్ధం.. ట్రంప్ అరిచినట్లుగా ప్రచారం!

సూపర్‌స్టార్ మహేష్ బాబుకు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. మెగాస్టార్ చిరంజీవి X వేదికగా ‘మై డియర్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు.. తెలుగు సినిమాకు నువ్వు గర్వకారణం, ప్రపంచాన్ని జయించాలనే లక్ష్యంతో ఉన్నావని.. సంవత్సరం గడిచేకొద్దీ నువ్వు చిన్నవాడివి అవుతున్నావని, రాబోయే సంవత్సరం అద్భుతంగా ఉండాలని, మరింత ఆదాయం రావాలని కోరుకుంటున్నాను అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. మహేష్ బాబుకు పుట్టినరోజు సోషల్ మీడియాలో పెద్దెత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

iQOO TWS Air 3 Pro: 50dB ANC, DeepX 3.0 స్టీరియో సౌండ్లతో TWS ఎయిర్ పాడ్స్ లాంచ్!

Exit mobile version