Anaganaga Oka Raju : ‘అనగనగ ఒకరోజు’ దీవాలి బ్లాస్ట్ ట్రైలర్ చూసారా.. నవ్వాగదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి, మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి దీపావళి ప్రత్యేక ప్రోమో విడుదలైంది. నవ్వుల టపాసులను తలపిస్తున్న ఈ ప్రోమో, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ అందరి నవ్వులు పూయిస్తోంది.
Also Read
రెండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకన్ల నిడివితో వచ్చిన ఈ దీపావళి ప్రోమో, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. తనదైన కామెడీ టైమింగ్ తో నవీన్ పోలిశెట్టి అదరగొట్టాడు. హాస్యం, తాజాదనంతో నిండి, ప్రేక్షకులను మెప్పించే కథలను ఎంచుకోవడంలో నవీన్ మరోసారి తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. అలాగే ఈ చిత్రం నుండి మొదటి గీతం త్వరలో విడుదల కానుందని కూడా ప్రకటించారు మేకర్స్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘అనగనగా ఒక రాజు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. నవీన్ పోలిశెట్టితో కలిసి ఆమె సరికొత్త వినోదాన్ని పంచనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి, జె యువరాజ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న విడుదల కానున్న ‘అనగనగా ఒక రాజు’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన దీపావళి ప్రోమో, ఆ అంచనాలను రెట్టింపు చేసింది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!