Harshaali Malhotra: ఆయనతో నటించడం నా అదృష్టం.. అఖండ2 అందరినీ అలరిస్తుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harshaali Malhotra: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో నిర్మితమవుతున్న పవర్ఫుల్ డివైన్ యాక్షన్ డ్రామా ‘అఖండ 2: తాండవం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా 2D, 3D ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాలో కీలక పాత్ర పోషించిన హర్షాలి మల్హోత్రా మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు.
దాదాపు పదేళ్ల తర్వాత థియేటర్స్‌కి రీఎంట్రీ:
“ఈ చిత్రంలో ‘జనని’ అనే స్వీట్, కేరింగ్ పాత్రలో కనిపించబోతున్నాను. జననీకి అఖండ ఆశీర్వాదాలు ఉంటాయి. ఆమె ఎప్పుడు ప్రమాదంలో పడినా అఖండ వచ్చి రక్షిస్తారు. బజరంగీ భాయిజాన్ తర్వాత ఇంత గ్యాప్ వచ్చినా, మంచి పాత్ర కోసం ఎదురు చూశాను. ఆ అవకాశం అఖండ 2తో దక్కిందని హర్షాలి చెప్పారు.
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
బాలయ్యతో నటించడం అంటే అదృష్టం:
లెజెండరీ నటుడు నందమూరి బాలకృష్ణతో నటించడం నా అదృష్టం. మొదట్లో చాలా నెర్వస్‌గా అనిపించింది. కానీ ఆయన కేర్‌తో గైడ్ చేశారు. ఒక ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నారు. ఆయన ఎనర్జీ అన్‌స్టాపబుల్. సెట్లో ఆయనతో పనిచేయడం గొప్ప అనుభవం అని హర్షాలి చెప్పుకొచ్చారు.
బోయపాటి శ్రీను గారి డైరెక్షన్ అమేజింగ్:
బోయపాటి గారి గురించి మాట్లాడుతూ.. ఆయన ఎంతో కేర్ తీసుకునే దర్శకుడు. నేను నెర్వస్‌గా ఫీల్ అయితే, ‘నీకు ఇది వస్తుంది’ అని ప్రోత్సహించేవారు. సీన్ ముగిసిన తర్వాత ప్రశంసిస్తారు. ఆయన ఎనర్జీ నా నటనను మరింత మెరుగుపరిచింది. జనని పాత్ర కోసం నన్నే ఎంచుకోవడం నా అదృష్టం అనిపించిందని అన్నారు.
షూటింగ్ లో ఎదుర్కొన్న చాలెంజ్‌లు:
మైనస్ డిగ్రీల్లో షూట్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. అలాంటి లొకేషన్స్‌లో పని చేయడం నిజంగా చాలెంజింగ్. అలాగే ఈ సినిమాలో కొన్ని యాక్షన్ స్టంట్స్ కూడా చేశాను. ఆ అనుభవం చాలా స్పెషల్ అని హర్షాలి తెలిపారు.
బాలీవుడ్ కే కాదు, టాలీవుడ్‌కు కూడా ప్రత్యేక అనుబంధం:
రెండో సినిమానే తెలుగు చిత్రం కావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. బాలకృష్ణతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభూతని ఆమె అన్నారు. తెలుగులో ఇష్టమైన స్టార్స్ గురించి మాట్లాడుతూ.. బాలకృష్ణ, అల్లు అర్జున్, ప్రభాస్ నాకు చాలా ఇష్టం అని తెలిపారు.
సల్మాన్ ఖాన్‌తో జ్ఞాపకాలు:
బజరంగీ భాయిజాన్ సమయంలో సల్మాన్ ఖాన్ గారితో ఎంతో ఫన్ మూమెంట్స్ ఉన్నాయి. మేము టేబుల్ టెన్నిస్ ఆడేవాళ్లం. అలానే బాలకృష్ణతో కూడా చాలా సరదాగా గడిచింది. అయితే ఆయన ఎనర్జీ కోసం ఇచ్చే కషాయం మాత్రం నాకిష్టం కాదు.. ఎందుకంటే నాకు అల్లం ఇష్టం ఉండదు అని నవ్వుతూ చెప్పారు.
భవిష్యత్తు లక్ష్యాలు:
సంజయ్ లీలా భన్సాలీ గారి సినిమాలో నటించాలనేది నా డ్రీమ్. ఆయన చూపించే హీరోయిన్స్ చాలా గ్రేస్‌ఫుల్‌గా ఉంటారు. నా కెరీర్లో అన్ని రకాల జానర్స్ చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉంది అని హర్షాలి వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!