Harsh Goenka: ఇస్రో ఛైర్మన్ జీతం ఎంతో తెలుసా..? అసలు విషయం బయటపెట్టిన ప్రముఖ పారిశ్రామికవేత్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harsh Goenka: ప్రముఖ పారిశ్రామికవేత్త.. ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.. ఎప్పటికప్పుడు ఎన్నో అంశాలను తన ఫాలోవర్స్‌తో పంచుకుంటారు.. తాజాగా, ఆయన చేసిన ఓ ట్వీట్ అందరినీ ఆకట్టుకుటుంది.. అసలు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ నెల జీతం ఎంత? అంటూ నెటిజన్లకు ప్రశ్న వేసిన ఆయన.. ఇస్రో చీఫ్ నెల జీతం గురించి చెబుతూనే ఆయన పంచుకున్న అంశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
”ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ నెలకు రూ. 2.5 లక్షల జీతం తీసుకుంటున్నారు.. మీరు చెప్పండి. ఇది ఆయనకు సరైన జీతమేనా? అంటూ ప్రశ్నించారు గోయెంకా.. డబ్బే కాకుండా ఉన్నతమైన ఎన్నో అంశాలు ఆయన లాంటి వ్యక్తులను ప్రేరేపిస్తాయని మనం అర్థం చేసుకోవచ్చు అని రాసుకొచ్చారు.. సాంకేతికత, పరిశోధనల్లో అంకితభావంతో ఆయన కృషి చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. సోమనాథ్ లాంటి వారు దేశం గర్వపడేలా చేయాలనుకుంటారు.. కాబట్టి ఆయన లాంటి వ్యక్తులకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు.. మొత్తంగా తన పోస్ట్‌లో, ఇది సరసమైన నెలవారీ ఆదాయమా అని ప్రజలను అడగడమే కాకుండా, సైన్స్ మరియు పరిశోధనపై సోమనాథ్‌కు ఉన్న అభిరుచి గురించి కూడా పేర్కొన్నారు హర్ష్ గోయెంకా.. అయితే, ఈ పోస్ట్ నిన్న (సెప్టెంబర్ 11న) షేర్ చేశారు.. పోస్ట్ చేసినప్పటి నుండి 8.13 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ సాధించింది.. వెయ్యి మందికి పైగా రీ ట్వీట్ చేస్తూ కామెంట్లు పెట్టగా.. 9 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. కామెంట్ సెక్షన్‌లో చాలా మంది తమ స్పందనలను కూడా పంచుకున్నారు.
Also Read
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
- Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
అయితే, ఓ నెటిజన్ “ఇది ఇల్లు, కారు, సేవకులు మరియు ఇతర ద్రవ్యేతర సౌకర్యాల వంటి ఇతర ప్రయోజనాలపై కూడా ఆధారపడి ఉండాలి.. కానీ, మీరు చెప్పినట్లుగా, అతను డబ్బును అతిపెద్ద ప్రేరణగా పరిగణించాడు. అతనికి విజయం, దేశం యొక్క గర్వం అతిపెద్ద అంశం.”గా రాసుకొచ్చారు.. “ఖచ్చితంగా! ఇస్రోలో ఛైర్మన్ సోమనాథ్ వంటి వ్యక్తుల అంకితభావం మరియు అభిరుచి ఎనలేనిది. వారి పని బహుమతులకు మించినది, సైన్స్, పరిశోధన మరియు వారి దేశం యొక్క శ్రేయస్సు పట్ల లోతైన నిబద్ధతతో నడపబడుతుంది. వారు నిజమైన ప్రేరణలు, మరియు సమాజానికి ఆయన చేసిన కృషి అమూల్యమైనది.” అంటూ కామెంట్ పెట్టారు.. మొత్తంగా.. హర్ష్ గోయెంకా చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట హల్ చల్‌చేస్తోంది.
Chairman of ISRO, Somanath’s salary is Rs 2.5 lakhs month. Is it right and fair? Let’s understand people like him are motivated by factors beyond money. They do what they do for their passion and dedication to science and research, for national pride to contribute to their…
— Harsh Goenka (@hvgoenka) September 11, 2023
తాజావార్తలు
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
ట్రెండింగ్
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..