NTV Telugu Site icon

Harry Brook Record: ఇంగ్లండ్‌ చిరస్మరణీయ విజయం.. ప్రపంచ రికార్డు నెలకొల్పిన హ్యారీ బ్రూక్‌!

Harry Brook

Harry Brook

Harry Brook Complete 1000 Runs in Test Cricke: ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌ 2023లో కీలకమైన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ చిరస్మరణీయ విజయం అందుకుంది. ఆద్యంతం మలుపులు తిరుగుతూ.. ఆధిపత్యం చేతులు మారుతూ ఇరు జట్లతో విజయం దోబూచులాడింది. చివరకు మూడో టెస్టులో ఆస్ట్రేలియాపై ఇంగ్లీష్ జట్టుదే పైచేయిగా నిలిచింది. నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో స్టోక్స్ సేన 3 వికెట్ల తేడాతో నెగ్గింది. 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 7 వికెట్లు కోల్పోయిన ఛేదించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ హ్యారీ బ్రూక్‌ (75; 93 బంతుల్లో 9×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

మూడో టెస్టులో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన ఇంగ్లండ్‌ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ ఓ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అతి తక్కువ బంతుల్లో టెస్ట్‌ల్లో 1,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. 1,058 బంతుల్లో బ్రూక్‌ వెయ్యి పరుగులు చేశాడు. ఇదివరకు ఈ రికార్డు న్యూజీలాండ్ ఆల్‌రౌండర్‌ కొలిన్‌ గ్రాండ్‌హోమ్‌ పేరిట ఉంది. గ్రాండ్‌హోమ్‌ 1,140 బంతుల్లో వెయ్యి రన్స్ చేశాడు. ఈ జాబితాలో న్యూజీలాండ్ పేసర్ టిమ్‌ సౌథీ (1167), ఇంగ్లీష్ క్రికెటర్ బెన్‌ డకెట్‌ (1168) ఉన్నారు.

Also Read: Gold Rate Today: మగువలకు గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంత ఉందంటే?

మరోవైపు టెస్ట్‌ల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 1,000 పరుగులు పూర్తి చేసిన రికార్డు మాత్రం ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు హెర్బర్ట్‌ సచ్లిఫ్‌ పేరుపై ఉంది. సచ్లిఫ్‌ 12 ఇన్నింగ్స్‌లలో ఈ మార్క్ అందుకున్నాడు. వెస్టిండీస్ మాజీ ప్లేయర్ ఎవర్టన్‌ వీక్స్‌ కూడా 12 ఇన్నింగ్స్‌లలో 1,000 రన్స్ చేశాడు. ఈ జాబితాలో డాన్‌ బ్రాడ్‌మన్‌ (13) రెండో స్థానంలో ఉండగా.. వినోద్‌ కాంబ్లీ (14) మూడో స్థానంలో ఉన్నాడు. లెన్‌ హటన్‌ (16), ఫ్రాంక్‌ వారెల్‌ (16), రోవ్‌ (16) నాలుగో స్థానంలో ఉన్నారు. యాషెస్‌ సిరీస్‌ 2023 మూడో టెస్ట్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన హ్యారీ బ్రూక్‌.. ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. బ్రూక్‌ 17 ఇన్నింగ్స్‌ల్లో 1,000 పరుగులు పూర్తి చేశాడు. దాంతో జింబాబ్వే మాజీ ఆటగాడు గ్యారీ బ్యాలెన్స్‌ సరసన నిలిచాడు.

Also Read: Insurance: వర్షాలకు కారు కొట్టుకుపోతే క్లెయిమ్ వస్తుందా?

Show comments