Today Gold and Silver Rates in Hyderabad: గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఒకరోజు తగ్గితే.. మరోరోజు పెరుగుతున్నాయి. శనివారం పసిడి ధరలు తగ్గగా.. ఆదివారం భారీగా పెరిగాయి. అయితే నేడు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (జులై 10) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,550 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,510లుగా ఉంది.
నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేదు. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. ఇక పసిడి ధరలు దేశంలోని పలు నగరాల్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,660గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,510గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,900లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,940 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,550లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,510లుగా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,510వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,510గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,550 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,510గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,510 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు బంగారం బాటలోనే వెండి ధరలు కూడా నడిచాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర ఈరోజు రూ. 73,300లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఎలాంటి మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 73,300లుగా ఉండగా.. చెన్నైలో రూ. 76,700లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 72,750గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 76,700లుగా నమోదైంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 76,700ల వద్ద కొనసాగుతోంది.
Also Read: Ghaziabad: అమ్మాయిలను మతం మారాలంటూ ఒత్తిడి చేశారు.. దొరికిపోయారు
Also Read: Ram Gopal Varma: పవన్ తో నీకు పోలికేంటి.. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది