ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వైఫల్యం కొనసాగుతుంది. రూ. 13.25 కోట్లు పెట్టినందుకు ఒక్క మ్యాచ్ లో మాత్రమే సెంచరీతో చెలరేగిన బ్యూక్ ఆ తర్వాత ఒక్క మ్యాచ్ లోనూ ఆకట్టుకోలేకపోతున్నాడు. ఓపెనర్ నుంచి ఐదో స్థానం వరకు బ్యాటింగ్ వచ్చినా దారుణమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తాజాగా గురువారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో హ్యారీ బ్రూక్ నాలుగో స్థానంలో వచ్చి మళ్ళీ డకౌట్ అయ్యాడు. అయితే ఇదే కేకేఆర్ పై ఈ సీజన్ లో సెంచరీ మార్క్ అందుకున్న హ్యారీ బ్రూక్ ఈసారి మాత్రం పేలవమైన బ్యాటింగ్ తో అవుట్ అయ్యాడు. స్పిన్ ఆడడంలో తన బలహీనతను మరోసారి బయటపెట్టాడు. అనుకుల్ రాయ్ బౌలింగ్ లో వికెట్ల ముందు మరోసారి దొరికిపోయాడు.
Also Read : What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
అనుకుల్ రాయ్ పుల్ లెంగ్త్ డెలివరీ వేయగా.. హ్యారీ బ్రూక్ అడ్డుకునే ప్రయత్నంలో ప్యాడ్లకు తాకింది. దీంతో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక కోల్ కతాతో మ్యాచ్ లో సెంచరీ మినహా బ్రూక్ మిగతా 8 మ్యాచ్ ల్లో కలిపి 79 బంతులు ఎదుర్కొని కేవలం 63 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. బ్రూక్ ఆటతీరుపై అభిమానులు మరోసారి ట్రోలింగ్ కు దిగారు.. ఏ స్థానంలో వచ్చినా అదే ఆటతీరు.. విసుగెత్తిస్తున్నాడు.. ఆడించింది చాలు.. బెంచ్ కు పరిమితం చేయడం మేలనుకుంటా అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ అంశం నెట్టింట వైరల్ గా మారింది.
Also Read : Manipur Violence: అదుపులో మణిపూర్ పరిస్థితి.. మరిన్ని బలగాలు మోహరింపు..