సిద్దిపేట మండలం ఎన్సాన్ పల్లి శివారులో 78కోట్లతో జిల్లా జైలు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి హరీష్ రావు, అడిషనల్ జైళ్ల శాఖ డీజీపీ జితేందర్. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. జైళ్లలో ఉన్న ఖైదీలకు మానసిక పరివర్తన తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఖైదీలలో మార్పు వచ్చి సత్ప్రవర్తన వచ్చి వారి కాళ్ళమీద వారు బ్రతికేలా దారి చూపెడుతోందని, ఖైదీల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. 425మంది ఖైదీలు వుండే విధంగా 34ఎకరాల్లో ఇక్కడ ఆధునిక వసతులతో నిర్మాణం చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
Also Read : Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
ఇదిలా ఉంటే.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ ద్వారా వెనకబడిన తరగతుల కులవృత్తిదారులకు 66 మందికి 100 శాతం సబ్సిడీతో రూ.లక్ష ఆర్థిక సాయం, 49 మంది దివ్యాంగులకు రూ.50వేల చొప్పున స్వయం ఉపాధి కొరకు లోన్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి హరీష్ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల పింఛన్ల విషయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అత్యధిక పెన్షన్ ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు.
Also Read : Bihar: పెళ్లి కాసేపట్లో అనగా ప్రియుడితో సోదరి జంప్.. కోపంతో పిండం పెట్టిన సోదరుడు
మహారాష్ట్ర, కర్ణాటక రూ.900 నుంచి 1,200 ఉండగా, గుజరాత్ లో రూ.900 మాత్రమే దివ్యాంగులకు పింఛన్ ఇస్తున్నారని తెలిపారు. ఏ రాష్ట్రంలో రూ.12 వందలకు మించి ఫించన్ ఇవ్వడం లేదన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ తల్లి మనస్సుతో అలోచించి ఇటీవల పెంచిన పింఛన్ తో కలుపుకొని రూ.4,016 అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల మంది దివ్యాంగులకు ప్రతి నెలా రూ.4,016 పింఛన్ అందనుందన్నారు.