Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ మాస్ గర్జన.. 2 గంటల 44 నిమిషాల నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్: హరీష్ శంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ustaad Bhagat Singh: డైరెక్టర్ హరీష్ శంకర్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌కు టాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఏ రేంజ్లో ఆకట్టుకుందో తెలిసిందే. ఈ సూపర్ హిట్ చిత్రం తర్వాత హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న లేటేస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మించారు. ఉగాది కానుకగా, రేపు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మేరకు హోటల్ దసపల్లాలో నిర్వహించిన గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్లో డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాత నవీన్ ఎర్నేని, హీరోయిన్స్ శ్రీలీలా, రాశి ఖన్నా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చందు పాల్గొన్నారు.
READ ALSO: Travel Bus Charges: వరుస సెలవులు.. భారీగా పెరిగిన ట్రావెల్స్ బస్సుల ఛార్జీలు..!
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ ఏవైటెడ్ ఫిలిం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వెండితెరపై ఒక తెలుగు బిగ్ స్టార్ కమర్షియల్ ఎంటర్టైనర్ వచ్చి చాలా కాలం అయ్యిందని, అందుకే ఈ సినిమా కేవలం ఫ్యాన్స్‌కే కాకుండా సామాన్య ప్రేక్షకులకు కూడా విపరీతంగా నచ్చుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సినిమా నిడివి గురించి మాట్లాడుతూ.. “మేము షూట్ చేసింది 2 గంటల 58 నిమిషాలు అయితే, ఎడిటింగ్‌లో తీసేసింది కేవలం 14 నిమిషాలు మాత్రమే. దీన్ని బట్టి సినిమాను ఎంత షార్ప్‌గా, పక్కాగా తీశామో అర్థం చేసుకోవచ్చు. అనుకున్నది అనుకున్నట్లుగా రావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారి డిసిప్లిన్, అలాగే మైత్రీ మూవీ మేకర్స్ ఇచ్చిన అన్ కాంప్రమైజ్డ్ సపోర్ట్” అని తెలిపారు. సినిమా రిలీజ్ డేట్ ప్రీ-పోన్ అయిన తరుణంలో, ఒక హీరోలా వచ్చి బాధ్యత తీసుకున్న థమన్‌కు హరీష్ శంకర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనకడుగు వేయకుండా సాంగ్స్ కోసం భారీ సెట్స్ ఏర్పాటు చేసిన నిర్మాతలను ఆయన కొనియాడారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను ఒక ఫుల్ ప్లెడ్జ్ మాస్ అవతార్‌లో చూస్తారని పవన్ ఫ్యాన్స్‌కు ఆయన హామీ ఇచ్చారు.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ‘దురంధర్’ వంటి భారీ సినిమా పోటీలో ఉన్నప్పటికీ, దాని జోనర్ వేరని.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ కావడంతో సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని హరీష్ శంకర్ నమ్మకం వ్యక్తం చేశారు. కలెక్షన్స్ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమని, కానీ ప్రేక్షకులు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారని అన్నారు.
READ ALSO: Kuldeep Wedding: జడేజా కాళ్లు మొక్కిన కుల్దిప్.. వీడియో వైరల్ !
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!