Site icon NTV Telugu

Harish Shankar : అహంకారం కాదు.. అనుబంధం ముఖ్యం: ఫ్యాన్స్‌ను అన్‌బ్లాక్ చేసిన హరీష్ శంకర్!

Harish Shankar Directer

Harish Shankar Directer

సాధారణంగా అభిమానులు దర్శకులను విమర్శించడం చూస్తుంటాం, కానీ తొలిసారి అభిమానులే ముందుకొచ్చి ఒక దర్శకుడిని తమను అన్‌బ్లాక్ చేయమని వినమ్రంగా అభ్యర్థించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తనదైన స్టైల్ మాస్ విజన్‌తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్, గతంలో కొందరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో అనవసరమైన నెగటివిటీకి పాల్పడటంతో, తన పనిపై దృష్టి నిలుపుకోవాలనే ఉద్దేశంతో ఆ అకౌంట్లను బ్లాక్ చేశారు.

Also Read : Manchu Manoj: మంచు మనోజ్ ‘బ్రూటల్ ఎరా’ నుండి ఒకేరోజు రెండు పవర్‌ఫుల్ అప్‌డేట్స్!

అయితే కాలం మారింది, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. #UstaadBhagatSingh సినిమా నుంచి వస్తున్న అప్‌డేట్స్, పవర్‌ఫుల్ కంటెంట్‌ను చూసిన తర్వాత అభిమానులు తమ తప్పును గ్రహించారు. నిన్న ఒక అభిమాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరి తరఫున హరీష్ శంకర్‌కు క్షమాపణ చెబుతూ, సినిమాను కలిసి సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో బ్లాక్ చేసిన ఐడీలను అన్‌బ్లాక్ చేయమని కోరారు. దీనిపై హరీష్ శంకర్ కూడా అంతే హుందాగా స్పందించారు. ‘గతాన్ని మరిచిపోదాం, అందరం ఒక కుటుంబంలా కలిసి సినిమాను జరుపుకుందాం’ అంటూ వెంటనే అకౌంట్లను అన్‌బ్లాక్ చేసి తన పెద్ద మనసును చాటుకున్నారు. సినిమా అంటే గొడవలు కాదు.. ఐక్యత అని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరి లక్ష్యం ఒక్కటే.. ఉస్తాద్ భగత్ సింగ్‌ను బాక్సాఫీస్ వద్ద ఒక సంబరంగా మార్చడం!

Exit mobile version